Friday, April 26, 2024
- Advertisement -

ప్రశాంత్ తో నే అంటున్న రాజశేఖర్!

- Advertisement -

‘అ!’ సినిమాతో పర్వాలేదనిపించుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ మధ్యనే ‘కల్కి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సీనియర్ హీరో రాజశేఖర్ హీరోగా నటించిన ఈ చిత్రం ఈ మధ్యనే విడుదల అయి ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ ను అందుకుంటోంది. విడుదలకు ముందు బాగానే అంచనాలు ఏర్పరుచుకున్న ఇప్పటికీ ఈ సినిమా కలెక్షన్ల పరంగా మాత్రం హిట్ అవ్వ లేకపోయింది. ఇక ప్రశాంత్ వర్మ తదుపరి సినిమా ఎలా ఉండబోతోంది అని అందరూ అనుకుంటున్న సమయంలో దర్శకుడు మళ్ళీ రాజశేఖర్ తో ఒక సినిమా చేయబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తాజాగా కల్కి ప్రమోషన్స్ లో ప్రశాంత్ వర్మ తాను నందమూరి బాలకృష్ణ కోసం ఒక మంచి సబ్జెక్టును తయారు చేశానని చెప్పాడు కానీ ఆ సినిమా వర్కౌట్ అవ్వలేదట. ఇప్పుడు ప్రశాంత్ వర్మ రాజశేఖర్ తోనే మరొక సినిమా తీసే ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఈసారి ఒక ఫుల్ లెంత్ కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమా తీయాలని ప్రశాంత్ వర్మ అనుకుంటున్నాడట. అంతేకాకుండా ఈ సినిమాని స్వయంగా రాజశేఖర్ నిర్మిస్తారని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -