ఐశ్వర్య ఆరాధ్యల ఆరోగ్య ప్రస్తుతం ఏలా ఉంది.. వాళ్లు ఎక్కడ ఉన్నారు ?

818
Aishwarya Aaradhya test positive for coronavirus
Aishwarya Aaradhya test positive for coronavirus

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అమితాబ్ బచ్చన్ కుటుంబ ఆరోగ్య పరిస్థితి గురించి చర్చ జరుగుతోంది. మొదట అమితాబచ్చన్ కరోనా పాజిటివ్ నిర్దారణ అయిన తర్వాత అభిషేక్ బచ్చన్ కి కూడా కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. ఆ తర్వాత కొన్ని గంటలకు తదుపరి టెస్టులో ఐశ్వర్య రాయ్ ఇంకా ఆమె కుమార్తె ఆరాధ్య కూడా కరోనా పాజిటివ్ గా రిపోర్ట్ వచ్చింది.

అమితాబచ్చన్ ఇంకా అభిషేక్ బచ్చన్ లు ముంబైలోని నానవతి హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. మరి ఐశ్వర్య ఇంకా ఆరాధ్యలు ఎక్కడ ఉన్నారు వారి ఆరోగ్య పరిస్థితి ఏంటీ అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వైధ్యులు ఐశ్వర్య ఇంకా ఆరాధ్యలకు పాజిటివ్ వచ్చిన మాట వాస్తవమే కాని వారికి లక్షణాలు ఎక్కువగా లేవని అన్నారు. వారు ఆసుపత్రిలో ఉండాలా లేకుంటే ఇంట్లోనే ఉండాలా అనేది వాళ్ళ ఇష్టంగా వైద్యులు చెప్పారు. డాక్టర్లు ఈ విధంగా చెప్పిన తర్వాత అభిషేక్ బచ్చన్ ట్విట్టర్ లో ఈ విషయంపై స్పందిస్తూ ఐశ్వర్య మరియు ఆరాధ్యలు ప్రస్తుతం ఇంట్లోనే ఉన్నారు.. వారికి ఐసోలేషన్ అక్కర్లేదని డాక్టర్లు చెప్పారని.. అందుకే ఇంట్లో ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ట్వీట్ చేశారు.

జయా బచ్చన్ ఇతర కుటుంబ సభ్యులకు నెగటివ్ వచ్చినప్పటికి.. వారు కూడా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. ఐశ్వర్య రాయ్ ఇంకా ఆరాధ్యలను ప్రతి రోజు అభ్జర్వ్ చేస్తూ అవసరం అయితే వారిని ఆసుపత్రికి తరలించే అవకాశం ఉంది. రెండు వారాల పాటు బచ్చన్ ఫ్యామిలీ అంతా కూడా ఇతరులకు పూర్తి దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇదే టైంలో బచ్చన్ ఇంటి పరిసర ప్రాంతాలను శానిటైజ్ చేసి.. ఆ ప్రాంతాన్ని కంటోన్మెంట్ ఏరియాగా ముంబై మున్సిపల్ అధికారులు ప్రకటించారు.

అన్నయ్య మూవీతో ఎంట్రీ ఇస్తున్న ప్రభాస్ చెల్లి..!

ఆది సాయికుమార్ హీరోగా పాన్ ఇండియా చిత్రం

నిర్మాత దిల్ రాజు కుమార్తె ఎమోషనల్ పోస్ట్..!

రష్మీ, అనసూయ యాంకరింగ్‌ నాకు నచ్చదు : ముక్కు అవినాష్

Loading...