Friday, April 26, 2024
- Advertisement -

చిరుకు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి 151 వ సినిమా సైరా మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. అక్టోబర్ 2వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఈ సినిమా తరువాత కొరటాలతో కలిసి చిరూ సెట్స్ పైకి వెళ్లనున్నారు. ప్రస్తుతం 152 వ సినిమాకు సంబంధించిన మూవీ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. చిరంజీవి పుట్టినరోజైన ఆగస్టు 22న ఈ సినిమా ను లాంచ్ చేసే అవకాశాలు వున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ సినిమాలో హీరో పాత్రతో పాటు హీరోయిన్ పాత్రకి కూడా చాలా ప్రాముఖ్యత వుంటుందట. అందువలన ఐశ్వర్యరాయ్ అయితే బాగుంటుందనే అభిప్రాయాన్ని చరణ్ దగ్గర కొరటాల వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇందులో చిరంజీవి డబుల్ రోల్ చేస్తున్నారు కాబట్టి ఇద్దరు హీరోయిన్ల అవసరం ఉంటుంది. అందుకే ఐష్, నయన్ లు ఇద్దరినీ తీసుకుంటున్నారా లేక నయన్ ను పక్కన పెట్టి ఐష్ ను మాత్రమే ఉంచుతారా అన్నది తెలియాలి. రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ తో పాటు మాట్నీ మూవీ సంస్థ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నది.

ఇప్పటిదాకా ఐష్ తెలుగులో స్ట్రెయిట్ మూవీ చేయలేదు. నాగార్జున రావోయి చందమామలో జస్ట్ ఒక స్పెషల్ సాంగ్ చేసింది కానీ అందులో ఒక్క డైలాగ్ కానీ సీన్ కాని ఉండదు . ఆపై కొందరు దర్శక నిర్మాతలు తమ సినిమాలో నటింపజేసేందుకు విశ్వప్రయత్నం చేశారు కాని వర్క్ అవుట్ అవ్వలేదు . మ‌రి ఇప్పుడు చిరు సినిమాలో న‌టించ‌నుంద‌నె వార్త‌లు ఫిలిం నగర్ టాక్. మరి ఇది నిజంగా కార్యరూపం దాల్చితే మెగా ఫ్యాన్స్ కు అంతకన్నా గుడ్ న్యూస్. మ‌రి ఐశ్వర్యరాయ్ ఏమంటుందో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -