రానా బాటలో సమంత …..

251
Akkineni Samantha will act The Web Series World
Akkineni Samantha will act The Web Series World

పెళ్లయిన తర్వాత రూటు మార్చిన సమంత అక్కినేని తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ వరుస హిట్లు తో దూసుకుపోతోంది. ‘రంగస్థలం’, ‘మహానటి’, ‘యూటర్న్’, ‘మజిలీ’ వంటి సినిమాలతో హిట్లు అందుకున్న సమంత ఈ మధ్యనే విడుదలైన ‘ఓ బేబీ’ సినిమాతో కూడా మరొక హిట్ ను నమోదు చేసుకుంది. ఇప్పటిదాకా వెండితెరపై వెలిగిన ఈ భామ ఇప్పుడు డిజిటల్ మీడియా వైపు దృష్టి పెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో సమంత ఒక వెబ్ సిరీస్ లో నటించనుంది అని సమాచారం అందుతోంది.

ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వారు ఒక వెబ్ సిరీస్ కోసం సమంతను సంప్రదించినట్లు సమాచారం. ఇప్పటికే రానా దగ్గుబాటి, నవదీప్, జగపతి బాబు వంటి నటులు వెబ్ సిరీస్ వైపు అడుగులు వేసిన సంగతి తెలిసిందే. సమంత కూడా వారి బాటలోనే వెబ్ సిరీస్ లో నటించబోతోందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక సినిమాల పరంగా సమంత ’96’ తెలుగు రీమేక్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘మన్మధుడు 2’ లో కూడా సామ్ గెస్ట్ పాత్ర లో కనిపించనుంది.

Loading...