Saturday, April 27, 2024
- Advertisement -

అలీ ఫోటో తీస్తే పెళ్లయిపోతుందట..

- Advertisement -

ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న స్టార్ట్ కమెడియన్లలో అలీ కూడా ఒకరు. అయితే కమెడియన్ గానే కాక హీరోగా కూడా ఒకప్పుడు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గత కొంతకాలంగా కమెడియన్ గా కొనసాగుతున్న అలీ ఇప్పుడు మళ్లీ హీరో రూపం దాల్చనున్నారు. గుడిబండ వెంకట సాంబిరెడ్డి నిర్మిస్తున్న ‘పండుగాడి ఫోటో స్టూడియో’ లో అలీ హీరోగా నటించనున్నారు. జంధ్యాల మార్కు కామెడీతో ఈ సినిమా ప్రేక్షకులను అలరించబోతోంది. “వీడు ఫోటో తీస్తే పెళ్లయి పోద్ది” అని ఒక ఆసక్తికరమైన కాప్షన్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.

తాజాగా ఈ సినిమా గురించిన వివరాలు బయటకు వచ్చాయి. ఈ సినిమాలో హీరో కు 40 ఏళ్లు వచ్చేదాకా పెళ్లి కాదట. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రిషిత అనే అమ్మాయి ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయం కాబోతుంది. “1150 చిత్రాల్లో నటించిన ఆలీ గారు ఈ చిత్రం లో హీరోగా అద్భుతంగా నటించారు. హీరోయిన్ గా రిషితను పరిచయం చేస్తున్నాము. కుటుంబ సభ్యులతో కడుపుబ్బా నవ్వుకునేలా ‘పండుగ ఫోటో స్టూడియో’ సినిమా ఉండబోతోంది.” అని అన్నారు నిర్మాత. ఈ సినిమాలో వినోద్ కుమార్, బాబు మోహన్, సుధ, జీవ తదితరులు నటిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -