శ్రీరెడ్డిపై కేసు నమోదు.. అరెస్ట్ ఖాయమంటున్నారు..!

639
Another Case Filed Against Sri Reddy
Another Case Filed Against Sri Reddy

టాలీవుడ్ లో శ్రీరెడ్డి చేసే రచ్చ మరొకరు చేయరు. ఎప్పుడు టాలీవుడ్ స్టార్స్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది. వారిని నోటికి వచ్చినట్లుగా బూతులతో తిట్టేసి ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. పదే పదే ఎవరిపై పడితే వారిపై బూతుల వర్షం కురిపిస్తుండటంతో ఆమెపై పోలీసు కేసు నమోదు అయ్యింది.

ఇటీవలే తనను శ్రీరెడ్డి ఇష్టం వచ్చినట్లుగా తిట్టిందని కరాటే కళ్యాణి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ కేసు నమోదు చేసి ఎంక్వౌరీ చేస్తున్న సైబర్ క్రైమ్ పోలీసులకు మరో ఫిర్యాదు అందింది. గత కొన్ని రోజులుగా శ్రీరెడ్డి, రాకేష్ మాస్టర్ ల మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్దం జరుగుతున్న విషయం తెలిసిందే. రాకేష్ మాస్టర్ పై శ్రీరెడ్డి ఇటీవల తీవ్ర స్థాయిలో బూతులు వాడుతూ కామెంట్స్ చేసింది. ఆ వీడియోతో సైబర్ క్రైమ్ పోలీసులకు రాకేష్ మాస్టర్ ఫిర్యాదు చేశాడు.

శ్రీరెడ్డి నోటికి వచ్చినట్లు తనను తిడుతుందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. రాకేష్ మాస్టర్ ఫిర్యాదును కరాటే కళ్యాణి ఫిర్యాదుతో జత చేసి రెండు కేసులను ఉమ్మడిగా విచారిస్తున్నట్లుగా సైబర్ క్రైమ్ పోలీసులు చెప్పుకొచ్చారు. ఈ మధ్య సైబర్ క్రైమ్ నేరాలపై పోలీసులు తొందరగా చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి శ్రీరెడ్డిని పోలీసులు త్వరలోనే అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం శ్రీరెడ్డి చైన్నైలో ఉంటుంది.

Loading...