Friday, April 26, 2024
- Advertisement -

ర‌జినీకాంత్‌తో సినిమా ప్లాన్ చేస్తున్న మురుగదాస్ ..?

- Advertisement -

మురుగదాస్ ..త‌మిళంతో పాటు తెలుగు,హిందీ బాషల‌లో సినిమాలుకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో మురుగదాస్ తెర‌కెక్కించిన ‘స్పైడర్’ వ‌చ్చింది. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఘోర ప‌రాజ‌యం ముట‌గట్టుకుంది. స్పైడర్ ఫలితంతో సంబంధం లేకుండా మురుగదాస్ తన త‌రువాత సినిమాను తమిళ స్టార్ హీరో విజయ్‌తో తెరకెక్కిస్తున్నాడు. విజయ్ – మురుగదాస్ ల ‘సర్కార్’ చిత్రం విడుదలకు ముస్తాభవుతోంది.

గ‌తంలో వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో తుపాకీ,కత్తి సినిమాలు వ‌చ్చాయి. ఈ రెండు సినిమాలు సూప‌ర్ హిట్లుగా నిలిచాయి. ఈ సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఈ సినిమా త‌రువాత మురుగదాస్ సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్‌తో సినిమా చేయ‌నున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం రజినీకాంత్ ఇప్పటికే కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ‘పెట్ట’ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఆ చిత్రం పూర్తి అయిన వెంట‌నే సూపర్ స్టార్ రజినీకాంత్ ఏఆర్ మురుగదాస్‌ కాంబోలో మూవీ పట్టాలెక్కే అవకాశం ఉంది. ఇక ర‌జినీ న‌టించిన రోబో 2.0 విడుద‌ల‌కు రెడీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -