Saturday, April 27, 2024
- Advertisement -

దేత్తడి హారిక గురించి ఈ ఆసక్తికర విషయం తెలుసా..!!

- Advertisement -

యూట్యూబ్ లో దేత్తడి హారిక గా మిలియన్స్ ఫాన్స్ ని సంపాదించుకున్న హారిక ఇటీవలే బిగ్ బాస్ కు కూడా వెళ్ళింది.. దాంతో ఆమెను తెలిసిన వారు, తెలియని వారు అందరు వెతకడం మొదలుపెట్టారు.. తెలంగాణ మాండలికంలో ఆమె ప్రేక్షకులను దేత్తడి ద్వారా అలరిస్తుండగా ఇక పై బిగ్ బాస్ లో ఆమె సందడి అందరు వీక్షించనున్నారు.. ఇక తెలుగులో ఆమె ఇప్పటివరకు ఒక్క సినిమా లో కూడా నటించలేదు. తమిళ సినిమా లో నటించింది.

అదే అర్జున్ రెడ్డి రీమేక్ లో.. మూడేళ్ల క్రితం విడుదలైన అర్జున్ రెడ్డి తర్వాత హిందీలో కబీర్ సింగ్ గా, తమిళ్ లో ఆదిత్య వర్మ గా రీమేక్ అయింది. తమిళ్ లో హీరో విక్రమ్ కొడుకు ధృవ్ విక్రమ్ ఆదిత్య వర్మ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. ఈ సినిమాలో బనితా సంధు హీరోయిన్ గా నటించారు. అర్జున్ రెడ్డి డాక్టర్ అయిన తర్వాత హాస్పిటల్ లో ఇద్దరు నర్స్ లు అర్జున్ రెడ్డి కి అసిస్ట్ చేస్తారు. గుర్తుందా? ఆ ఇద్దరూ నర్స్ లలో ఒక నర్స్ పాత్రను తెలుగులో లహరీ షారీ పోషించగా, తమిళ్ లో ఆ పాత్ర లో అలేఖ్య హారిక కనిపించారు.

అలా అలేఖ్య హారిక తెలుగులోనే కాకుండా తమిళ్ లో కూడా పరిచయమయ్యారు. బిగ్ బాస్ షో విషయానికి వస్తే ఈ వారం ఎలిమినేషన్ మొదలవుతుంది. ఎలిమినేషన్ ప్రక్రియ తో పాటు కంటెస్టెంట్స్ కి టాస్క్ లు, ఇంకా ప్రేక్షకుల ఓటింగ్ కూడా మొదలవుతాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -