Friday, April 26, 2024
- Advertisement -

బాబు గోగినేని కోసం కోర్టుకు వెళ్లిన బిగ్‌బాస్‌

- Advertisement -

తెలుగు బిగ్‌బాస్ సీజ‌న్ మారిన త‌ల రాత మాత్రం మార‌లేదు. బిగ్‌బాస్‌ను పోలీసుల కేసులు వెంటాడుతున్నాయి. బిగ్‌బాస్ మొద‌టి సీజ‌న్‌లో షోలో ఉన్న హోస్‌మెట్ ముమైత్ ఖాన్ డ్ర‌గ్స్ కేసు వ్య‌వ‌హారంలో షో నుండి మ‌ధ్య‌లో వెళ్లిపోయింది.ఇప్ప‌డు రెండో సీజ‌న్‌లో కూడా షో లోని హోస్‌మెట్ బాబు గోగినేనిపై ఓ కేసు న‌మోదైంది.హేతువాది అయిన బాబు గోగినేనిపై దేశ ద్రోహం, ఆధార్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఇతరుల ఆధార్ సమాచారాన్ని పక్క దేశాలకు అందజేయడం, హేతువాద ప్రచారం కోసం విదేశాల నుండి నిధుల సేకరణ తదితర ఆరోపణల కింద ఆయనపై కేసు నమోదు చేశారు.

సైబరాబాద్ పోలీసులు బాబు గోగినేనికి నోటీసులు పంపే ప్రయత్నం చేశారు.అయితే ఈ విషయంలో కలుగజేసుకున్న బిగ్‌బాస్ టీమ్ ఆయనకు కోర్టు నుండి స్టే తీసుకొచ్చారు.ఆయన బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తరువాతే పోలీసులు విచారించేలా కోర్టు స్టే విధించింది.షోలో బ‌ల‌మైన హోస్‌మెట్ అయిన బాబు గోగినేని బ‌య‌టికి వెళ్లితే ఆ ప్ర‌భావం బిగ్‌బాస్‌పై ప‌డుతుంద‌ని భావించిని షో యాజ‌మాన్యం త‌మ ప‌లుకుబ‌డిని ఉప‌యోగించి బాబుకి స్టే తీసుకొచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -