బిగ్ బాస్ 3 లోకి మరో ఇద్దరు టాలీవుడ్ హీరోయిన్ లు..

519
Bigg Boss Telugu 3: Two Tollywood heroines Wild Card Entry in Bigg Boss House
Bigg Boss Telugu 3: Two Tollywood heroines Wild Card Entry in Bigg Boss House

బాలీవుడ్ లో సంచనల విజయం అందుకున్న బిగ్ బాస్ ఈవెంట్ సౌత్ కు వచ్చిన సంగతి తెలిసిందే. మొదటి సీజన్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తే, రెండో సీజన్లో నాని మెరుపులు మెరిపించాడు. ప్రస్తుతం మూడో సీజన్ జరుగుతున్నది. ఈ మూడో సీజన్ ను నాగార్జున హోస్ట్ చేస్తున్నారు. నాగార్జున్ హోస్ట్‌గా ఉన్న బిగ్ బాస్ సీజన్ 3 మొద‌టి వారం పూర్తి చేసుకుని రెండో వారంలోకి అడుగుపెట్టింటి. 15 మంది కంటెస్టెంట్స్‌లో హేమ తొలి ఎలిమినేషన్ కాగా.. వైల్డ్ కార్డ్‌తో హౌస్‌లోకి తమన్నా సింహాద్రి ఎంట్రీ ఇచ్చింది.

సెకండ్ వీక్ లో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటె, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మరో ఇద్దరు టాలీవుడ్ హీరోయిన్లు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని సమాచారం. అందులో ఒకరు శ్రద్దా కాగా, రెండో హీరోయిన్ ఎవరు అన్నది తెలియాలి. మరో ఇద్దరు హీరోయిన్లు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తే.. మరింత గ్లామర్ గా మారడం ఖాయం అని అంటున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. రాబోయే రోజుల్లో బిగ్ బాస్ 3 ప్రజలను ఎలా మెప్పిస్తుందో చూడాలి.

Loading...