అన్నీ విషయాల్లో తలదూరుస్తున్న పునర్నవి

457
Bigg Boss Telugu Season 3: Punarnavi Bhupalam Vs Sreemukhi
Bigg Boss Telugu Season 3: Punarnavi Bhupalam Vs Sreemukhi

నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ మూడవ సీజన్ ఆసక్తికరంగా హై టిఆర్పి రేటింగ్స్ తో ముందుకు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇంట్లో ఉన్న అందరు కంటెస్టెంట్ లతో పోలిస్తే ప్రతి గొడవలను కావాలని చేసేది పునర్నవి భూపాలం మాత్రమే చిన్నదైనా పెద్దదైనా ప్రతి గొడవ లోను కావాలి గొడవ పెద్దది చేయడానికి ప్రయత్నిస్తూ వస్తుంది ఈ నేపథ్యంలోనే ఒకసారి రోహిణి మరియు శ్రీముఖి కి మధ్య గొడవ వస్తే శివ జ్యోతి రోహిణి ని కూల్ చేయడానికి ట్రై చేస్తుండగా, మరోవైపు పునర్నవి వచ్చి శ్రీముఖి గురించి నెగటివ్ గా చెప్పి రోహిణి ని మరింత రెచ్చగొట్టడం మొదలుపెట్టింది.

కోపం తెచ్చుకున్న శ్రీముఖి వితిక ని పిలిచి తనకి రోహిణి మధ్య వచ్చిన గొడవ కి తామిద్దరం కూర్చుని మాట్లాడుకుంటే సరిపో తుందని వేరే వాళ్ల ఇన్వొల్వెమెంట్ వద్దు అని చెప్పింది. శ్రీముఖి వాదనలో తప్పు లేదని చెప్పాలి. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినప్పటి నుంచి పునర్నవి అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి బాగా ప్రయత్నిస్తోంది. కేవలం వరుణ్ సందేశ్, వితిక మరియు రాహుల్ తో మాత్రమే స్నేహంగా మెలిగే ఈమె మిగతావారి గురించి ఎప్పుడు నెగిటివ్ గా మాట్లాడుతూనే కనిపిస్తోంది.

Loading...