Friday, April 26, 2024
- Advertisement -

తెలుగులో మరో డిఫరెంట్ మూవీ టీజ‌ర్‌

- Advertisement -

తెలుగు ఇండ‌స్ట్రీలో కొత్త క‌థలు చాలానే వ‌స్తున్నాయి. గ‌త కొంత‌కాలం నుంచి తెలుగు ద‌ర్శ‌కుల‌లో చాలానే మార్పులు చోటు చేసుకున్నాయి. అర్జున్ రెడ్డి సినిమా తెలుగు సినిమా స్థితిని గ‌తిని పూర్తిగా మార్చేసింది. ఈ సినిమా త‌రువాత తెలుగులో కొత్త క‌థలు ఎక్కువుగా వ‌స్తున్నాయి. చిన్న సినిమాలకు కొత్తదనమే ప్రధాన ఆయుధం మారింది. తాజాగా ఇదే కొవ‌లో వ‌చ్చిన సినిమా ‘బ్రోచేవారెవరురా’.

తాజాగా ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు చిత్ర యూనిట్. టీజ‌ర్‌ను చూస్తుంటే ఏదో కొత్తగా చూపించాలని ట్రై చేస్తున్నట్లు అర్ధమవుతోంది. శ్రీ విష్ణు హీరోగా, నివేత పేతురేజ్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో సత్య దేవ్ – ప్రియదర్శి ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. గ‌తంలో శ్రీ విష్ణు న‌టించిన మెంటల్ మదిలో సినిమాకు దర్శకత్వం వహించిన వివేక్ ఆత్రేయ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. టీజ‌ర్‌ ఆక‌ట్టుకోవ‌డంతో బ్రోచేవారెవరురా సినిమాపై అంచ‌నాలు భారీగా పెరిగాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -