బండా బూతులు తిడితున్నారు.. మీ సంస్కారానికి ఓ దండం : చిన్మయి

529
Chinmayi Fires On Netizens
Chinmayi Fires On Netizens

సింగర్.. డబ్బింగ్ ఆర్టిస్టుగా మంచి పేరు సంపాధించుకుంది చిన్మయి. అయితే ఈమె ఎప్పుడు ఏదో వివాదంతో వార్తల్లో నిలిస్తూనే ఉంటుంది. కోలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై పెద్ద పోరాటమే చేస్తోంది. కోలీవుడ్ స్టార్ రైటర్ వైరముత్తు రాధారవి వంటి వారిపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

వైరముత్తు ఎంతో మందిని వేధించాడని.. తనతో కూడా అలాగే ప్రవర్తించాడని చిన్మాయి చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్ లో పెద్ద దుమారం లేపాయి. చిన్మయిని కోలీవుడ్ డబ్బింగ్ యూనియన్ నుంచి తొలగించి కోర్టు కేసులు పెట్టినా ఆమె బెదరలేదు. మహిళల తరుపున పొరాడుతున్న ఆమెని సోషల్ మీడియాలో బండ బూతులు తిడుతున్నారు. ఇటీవలే పూజాహెగ్డే-సమంత వివాదంలోనూ ఆమె సమంతకు మద్దతుగా నిలిచి తిట్టి పోసింది. దీంతో చిన్మయిని బూతులు తిడుతూ మెసేజ్ లు పెడుతున్నారట.

‘తప్పు చేస్తే క్షమాపణలు అడగవలసిందే అని నాకు తెలుసు.నన్ను కొందరు ల.ము అని బూతులు తిడుతున్నారు. అసభ్యులకి మిమ్మిల్ని ఇలా తయారు చేసిన వాల్లకి.. మీ సంస్కారానికి ఓ దండం’ అని చిన్నయి విమర్శించింది. ఇక చిన్మాయికి మద్దతుగా.. ఎల్.ఎం అంటే లేడీ మాఫియా అని కొత్త అర్దాన్ని చెప్పి మద్దతిచ్చారు. దాంతో ఆమె మహిళలందరూ మాఫియాలే అని చెప్పుకొచ్చింది. కొత్త అర్థాన్ని చెప్పిన నెటిజన్స్ కు ధన్యవాదాలు తెలిపింది.

Loading...