కథ విషయం లో నే వెనక్కి తగ్గినా చిరంజీవి అందుకేనా….?

194
Chiranjeevi Rejected Director Nag Ashwin Story
Chiranjeevi Rejected Director Nag Ashwin Story

మహానటి సినిమా విడుదల అయినా వెనువెంటనే ఆ సినిమా దర్సకుడు నాగ్ అశ్విన్ కి అనేక మంది దర్శక నిర్మాతలు అవకాశాల తో ఎదురు నిలిచారు. స్వయం గా తన మామ అయినా అశ్వినీ దత్ కూడా ఒకటి రెండు భారీ సినిమాలు నిర్మించాలనే తపన తో ఉన్నారట. సినిమా విడుదల అయ్యాక చిరంజీవి దగ్గర కి తీసుకొని వెళ్ళి నాగ్ అశ్విన్ తో ప్రాజెక్ట్ గురించి కూడా డిస్కస్ చేశారట. అయితే అప్పట్లో నే చిరంజీవి నాగ్ అశ్విన్ దర్శకత్వం లో నటిస్తారు అనే వార్తలు వచ్చాయి.

నిజానికి అశ్విని దత్ తాను తీసిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా కి రెండో భాగం చేయాలి అనుకుంటూ అశ్విన్ తో ఒక కథ రెడీ చేయించుకున్నారట. చిరంజీవి కూడా కథ మొదట్లో నచ్చి ఇంట్రెస్ట్ చూపించారట కానీ ఇప్పుడు ఆ కథ కరెక్ట్ కాదు అని వేరే సినిమాల వైపు మొగ్గు చూపిస్తున్నారట.

నిరాశ పడాల్సిందేమి లేదు అని చెప్పి అశ్విన్ ని ఒక కొత్త కథ రెడీ చేసుకోమని సలహా కూడా ఇచ్చారట. అయితే ఇంత సడన్ గా ప్రాజెక్ట్ ఆగిపోయింది, వేరే కథ గురించి ఆలోచించాలి అంటే కష్టం అని ఇప్పుడు అశ్విన్ ఏం సినిమా చేయాలా అనే డైలమా లో పడ్డారట.

Loading...