Friday, April 26, 2024
- Advertisement -

ఫ‌స్ట్ లుక్‌తోనే సంచ‌లనం రేపుతున్న స్టార్ హీరో

- Advertisement -

త‌మిళ స్టార్ హీరోల‌లో ధ‌నుష్ కూడా ఒక‌రు. కెరీర్ స్టార్టింగ్ నుంచి విభిన్న క‌థ‌ల‌ను ఎంచుకుంటు త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ర‌జినీ అల్లుడిగా కెరీర్ మొద‌లుపెట్టిన ధ‌నుష్ ఎప్పుడు కూడా త‌న మామ పేరు చెప్పుకుని పైకి రావల‌ని చూడ‌లేదు. ధ‌నుష్ ఫ‌స్ట్ నుంచి మిడిల్ క్లాస్ అబ్బాయిగానే కనిపిస్తుటాడు. త‌న సినిమాలు కూడా అదేవిధాంగా ఉంటాయి. దీనికి ఉద‌ర్హ‌ణే ‘రఘువరన్ బీ టెక్‌. ధ‌నుష్ తాజాగా న‌టిస్తున్న కొత్త చిత్రం ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు. ధ‌నుష్ ప్ర‌స్తుతం ‘అసురన్’ అనే సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమాలో త‌న లుక్‌ను పూర్తిగా మార్చేశాడు ధ‌నుష్.

తాజాగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌. గుబురుగా ఉండే మీసాలు.. గడ్డంతో కనిపిస్తున్న ధనుష్ తలకు ఒక తువ్వాలు చుట్టుకొని.. పొడవు చేతులు ఉండే గోధుమ రంగు చొక్కా.. పంచె కట్టుకొని సీరియస్ గా నడుస్తూ ఉన్నాడు. ఇక చేతిలో పొడవాటి కత్తి.. మొహంపై.. షర్టుపై చిందిన రక్తం ఉంది. ధ‌నుష్ ఫ‌స్ట్ లుక్‌కి సోష‌ల్ మీడియాలో సూప‌ర్ రెస్ప‌న్స్ వ‌స్తోంది. మంజు వారియర్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమాకు వెట్రిమారన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేర‌డంతో త్వర‌లోనే విడ‌ద‌ల తేదీని ప్ర‌క‌టిస్తామ‌ని తెలిపింది చిత్ర యూనిట్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -