Saturday, April 27, 2024
- Advertisement -

తెలంగాణ సినిమా, తెలుగు సినిమా అని వేరు చేసిన డైరెక్టర్

- Advertisement -

ఈ మధ్య చాలా మంది తెలుగు సినిమా ని వేరు చేసి తెలుగు సినిమా తెలంగాణ సినిమా అని ప్రచారం చేయడం మొదలెట్టారు. ఎంత తెలంగాణ యాస వాడితే మాత్రం అది తెలంగాణ సినిమా అయిపోతుందా? ఒకప్పుడు తెలుగు లో వచ్చిన సినిమాల్లో తెలంగాణ యాస ఉంది, కానీ అప్పుడు తెలంగాణ సినిమా అని ఎందుకు ప్రచారం చేయలేదు? అనే అనుమానాలు వ్యక్తం అవుతాయి. ఇప్పుడు దొరసాని సినిమా విషయం లో కూడా తెలంగాణ సినిమా అని విపరీతం గా పొగుడుతున్నారు కొందరు.

తాజాగా దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి కూడా ఈ సినిమా విషయం లో అభిప్రాయాన్నే వ్యక్తపరిచారు. తను ముందు నుంచి తెలుగు సినిమా ని తెలంగాణ సినిమా తిరిగి ఆవిష్కరిస్తుంది అనే భావన లో ఉన్నట్టు, ఈ దొరసాని సినిమా అది నిజం అని ప్రూవ్ చేసినట్టు తెలిపాడు. అయితే ఇది చాలా మంది నెటిజన్స్ కి నచ్చలేదు.

“తెలుగు సినిమా ని తెలంగాణ సినిమా పునారవిష్కరిస్తుంది అనే నా నమ్మకాన్ని ఈ దొరసాని సినిమా మళ్ళీ నిజం అని ప్రూవ్ చేసింది. ఈ సినిమా చాలా సహజంగా, మనసుల్ని హత్తుకొనే విధంగా, మనోరంజకంగా, కళాత్మకం గా ఉంది. ఆనంద్ దేవరకొండ మరియు శివాత్మిక ఇద్దరూ బాగా చేశారు. మిగిలిన నటులు కూడా బాగున్నారు. ఈ సినిమా ని థియేటర్ల లో చూడండి.” అని ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేపుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -