ఉదయ్ కిరణ్ బయోపిక్, తేజ ఏమంటున్నాడంటే?

306
Director Teja Shocking comments on uday Kiran Biopic
Director Teja Shocking comments on uday Kiran Biopic

సీత సినిమా పరాజయం తర్వాత అటు కాజల్ అగర్వాల్ కి, ఆ సినిమా ని దర్శకత్వం వహించిన దర్శకుడు తేజ కి టైం సరిగా కలిసి రావడం లేదు. అయితే ఇప్పుడు తేజ ఏ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వస్తాడు అనే విషయం మీద క్లారిటీ లేదు. ఈ విషయం దర్శకుడి దగ్గర కూడా కదిలించి చూసారు కొందరు. అందరూ బయోపిక్స్ తో సత్తా చాటుతున్నారు అని తేజ ని కూడా ఉదయ్ కిరణ్ బయోపిక్ చేస్తే బాగుంటుంది అని అందరూ భావిస్తున్నారు. అయితే ఈ విషయం మీద తేజ స్పందించాడు.

ఇదే విషయం మీద మాట్లాడుతూ ఉదయ్ కిరణ్ జీవితం లో అన్ని విషయాలు తనకి బాగా తెలుసనీ, కానీ తను ఈ ప్రాజెక్ట్ మాత్రం ఎప్పుడూ అటెంప్ట్ చేయాలని అనుకోవడం లేదు అని క్లారిటీ ఇచ్చాడు. అయితే ఈ సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. “అయితే నేను ఒక మనిషి సినిమా మీద సినిమా తీసి డబ్బులు సంపాదించాలి అని అనుకోవడం లేదు. అందుకే ఈ సినిమా చేయను అని చెప్పాను.” అన్నాడు తేజ. ఇదంతా బాగుంది కానీ తేజ నెక్స్ట్ ఫిలిం ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది

Loading...