Friday, April 26, 2024
- Advertisement -

విజయ్ దేవరకొండ రిప్లై కి షాక్ అయిన హరీష్ శంకర్

- Advertisement -

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇటీవలే నటించిన సినిమా ‘గద్దలకొండ గణేష్’ ఈ సినిమా సినిమా ఇటీవల విడుదలై మంచి సక్సెస్ అందుకుంది. సినిమా యూనిట్ కూడా సినిమా కి సంబందించిన విజయోత్సవ సభ ని ఘనం గా జరిపారు. ఈ సినిమా మాస్ ఆడియన్స్ ని విపరీతం గా ఆకట్టుకుంది. అయితే హరీష్ శంకర్ ఈ సినిమా విజయోత్సవ సభ లో మాట్లాడుతూ ఈ సినిమా విజయాన్ని వాల్మీకి మహర్షి కి అంకితం ఇస్తున్నట్లు తెలిపాడు.

అయితే చాలా మంది హరీష్ ని ఇటీవల ఇంటర్వ్యూ లలో విజయ్ దేవరకొండ తో పని చేస్తే బాగుంటుంది అని చెప్తూ వచ్చారు. అయితే ఈ విషయమై హరీష్ ఇటీవలే ఒక క్లారిటీ ఇచ్చాడు. హరీష్ శంకర్ ఆల్రెడీ విజయ్ ని ఒక కథ విషయమై అప్రోచ్ అయ్యాడట కానీ విజయ్ మాత్రం బిజీ గా ఉన్నా అని చెప్తూ ఏడాదిన్నర వరకు ఖాళీ గా లేనని సమాధానం ఇచ్చాడట.

ఇదే విషయం హరీష్ పంచుకుంటూ ఇలా అన్నాడు. “అర్జున్ రెడ్డి తరువాత విజయ్ కి కథ చెప్పాలని మెసేజ్ పెట్టాను. అన్నా.. నేను ఏడాదిన్నర, రెండేళ్ల వరకూ బిజీగా ఉన్నాను. ఆ తర్వాత కలుద్దాం,సినిమా గురించి కాకుండా వేరే విషయం అయితే కలవడానికి రెడీ” అని విజయ్ చెప్పాడట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -