Friday, April 26, 2024
- Advertisement -

ఒంటరిగా రమ్మని పిలిచాడు : నాగార్జున హీరోయిన్

- Advertisement -

సినీ పరిశ్రమలో చాలా మంది హీరోయిన్లు క్యాస్టింగ్ కౌచ్, మీటూ లాంటివి ఎదుర్కున్నారు. ఈ క్రమంలో చంద్రలేఖ సినిమాలో నాగార్జున సరసన నటించిన హీరోయిన్ ఇషా కొప్పికర్ సంచలన విషయాన్ని చెప్పారు. తాజాగా ఓ ఇంటర్వ్యులో ఆమె మాట్లాడుతూ.. ఓ పెద్ద స్టార్ ఎవరూ లేకుండా ఒంటరిగా రమ్మన్నాడు. కనీసం డ్రైవర్ కూడా ఉండకూడదని కండీషన్ పెట్టాడు.

ఆయన చాలా బిజీగా ఉండి కూడా అడిగాడు. అతని ఇంటెన్షన్ నాకు అర్దమై.. నటించేందుకు వస్తానని.. కంప్రమైజ్ కి అయితే రాలేనని చెప్పాను. కమిట్మెంట్ ఇవ్వకపోవడంతో.. నా ఆఫర్ ను మరో హీరోయిన్ కు ఆ స్టార్ ఇప్పించాడని చెప్పింది. కనీసం సినిమా నుంచి తీసేస్తున్నట్లు కూడా తెలియకుండా చేశాడని చెప్పింది. పరిశ్రమలో ఎలాంటి సన్నివేశం ఎదురైనా.. నా వెంట నన్ను ఆదుకునే అద్భుతమైన కుటుంబం ఉంది. అందుకే ఇలాంటి అభద్రతా ప్రపంచంలోనూ రాటు దేలాను.

తల వొంచకుండా తలెత్తుకుని ఎదిరించాను! అని ఇషా తెలిపింది. ఒంటరిగా ముంబైలో ఉండాలని వచ్చినా నాకు ఎవరి నుంచి సపోర్ట్ లేదు. అందువల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాను తప్ప వేరే సమస్యలేవీ లేవు అని తెలిపింది. అంతేకాకుండా బిగ్ స్టార్స్ తో క్లోజ్ గా ఉండే సెక్రటరీలతోనూ కొన్ని ఇబ్బందులు ఉంటాయని.. కొన్నిసార్లు వారు అమర్యాదగా ప్రవర్తించారని.. కొందరు అయితే అసభ్యంగా తాకారని చెప్పుకొచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -