Friday, April 26, 2024
- Advertisement -

గ్లామరస్ పాత్రలపై ఇస్మార్ట్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

- Advertisement -

‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టిన హాట్ బ్యూటీ నటేష్ ఈ మధ్యనే రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విడుదలైన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకుంది. నిధి అగర్వాల్, నభ నటేష్ హీరోయిన్లు గా నటించగా తన అందాల ఆరబోతతో అందరి దృష్టిని ఆకర్షించింది నభ. అయితే గ్లామర్ పరంగా ఈమెకు వస్తున్న అట్టెన్షన్ తనకి నచ్చడం లేదని కొందరు చెబుతున్నారు. ఈమధ్యనే మీడియాతో మాట్లాడుతూ తన తదుపరి సినిమా అయినా ‘డిస్కోరాజా’ సినిమాతో తాను కేవలం ఒక గ్లామర్ డాల్ గా మాత్రమే కాక ఒక నటిగా కూడా తను నిరూపించుకోబోతున్నట్లు తెలిపింది.

నిజానికి నభా నటేష్ ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతోనే తన నటనకి మంచి మార్కులు వేయించుకుంది. కానీ అలాంటిది ఈమె ఇలాంటి స్టేట్మెంట్ చేయడం అందరినీ షాక్ కి గురి చేస్తోంది. పైగా ప్రస్తుతం హ్యాపెనింగ్ బ్యూటీ గా ఉన్న నభా నటేష్ గ్లామరస్ పాత్రలు చేయడానికి ఆసక్తి చూపించకపోతే ఈమెకి ఆఫర్లు తగ్గిపోతాయని అనడం అతిశయోక్తి కాదు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు కమర్షియల్ సినిమాలు వద్దు అని చెప్పి ఆఫర్లు లేక ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోయారు. అలాంటిది ఇలాంటి కామెంట్లు చేయడం బాలేదని మరి కొందరు చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -