Friday, April 26, 2024
- Advertisement -

ఎంఎస్‌ నారాయణ వర్ధంతికి బర్త్ డే విష్ చేసిన హైపర్ ఆది.. నెటిజన్లు ఫైర్..!

- Advertisement -

నేడు కమెడియన్ ఎంఎస్ నారాయణ వర్ధంతి. పలువురు ప్రముఖులు ఈ సందర్భంగా నారాయణను గుర్తుచేసుకుంటూ నివాళులు అర్పించారు. అయితే హైదరాబాద్‌కు శ్రేయాస్ మీడియా తమ సోషల్ మీడియా పేజ్‌‌లో ఎంఎస్ నారాయణకు నివాళులు అర్పించింది. ఆ ఫోటోనే జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది తన ఫేస్ బుక్ లో షేర్ చేశాడు. ఇక్కడి వరకు బానే ఉంది.

అయితే అసలు ఆ ఫోటోలో ఏం రాసి ఉందో చూసి ఉంటే బాగుండేది. ఫొటోలో ఎంఎస్ నారాయణ వర్ధంతి అని రాసుంటే.. హైపర్ ఆది ‘హ్యాపీ బర్త్‌డే సర్’ అని ఫోస్ట్ పెట్టాడు. దాంతో నెటిజన్లుకు ఆది అడ్డంగా దొరికేశాడు. దాంతో అతని ఏకిపారేశాడు. విషయం ఏంటో తెలుసుకోకుండా ఏదిపడితే అది పోస్ట్ చేస్తే ఇలాగే ఉంటుంది అంటూ తిట్టిపోశారు.

ఆ తర్వాత జరిగిన తప్పు తెలుసుకుని వెంటనే ఆ పోస్ట్ డిలీట్ చేసి మళ్లీ అదే ఫొటోను పోస్ట్ చేస్తూ.. ‘ఎంఎస్ నారాయణ వర్ధంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటున్నాం’ అని పెట్టాడు. అయితే తప్పుడు పోస్ట్ పెట్టిన వెంటనే ఆది చూస్కుని ఉంటే దొరికేవాడు కాదేమో. ఆ పోస్ట్ పెట్టిన దాదాపు రెండు గంటల తర్వాత చూసుకున్నాడట. అప్పటికే దాదాపు 600లకు పైగా లైక్స్, కామెంట్స్ వచ్చేశాయి.

దాంతో అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా వైరల్ అయింది. వర్ధంతికి బర్త్ డే కి తేడా తెలియదా అని నెటిజన్లు ఆదిని ఏసుకుంటున్నారు. ఇక ఎన్నో సినిమాల్లో నటించి, తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు ఎంఎస్ నారాయణ. 2015 జనవరిలో అనారోగ్య సమస్యలతో ఎంఎస్ నారాయణ కన్నుమూశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -