విఠల్ వాడి ఫస్ట్ లుక్ లాంచ్ !

295
Jagapathi Babu Launches Vithal Wadi Movie First Look Poster
Jagapathi Babu Launches Vithal Wadi Movie First Look Poster

ఎన్.ఎన్ ఎక్స్పీరియన్స్ ఫిలిమ్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 విఠల్ వాడి మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను నటుడు జగపతిబాబు విడుదల చేశారు.టి.నాగేందర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను నరేష్ రెడ్డి.జి నిర్మించారు. ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమంలో జగపతిబాబుతో పాటు చిత్ర యూనిట్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జగపతిబాబు మాట్లాడుతూ… విఠల్ వాడి చిత్రం ఫస్ట్ లుక్ ఆసక్తికరంగా ఉంది. చిత్ర యూనిట్ సభ్యులకు ఆల్ ది బెస్ట్. ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్న రోహిత్ కు బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను. నిర్మాత నరేష్ రెడ్డి మరిన్ని మంచి చిత్రాలు నిర్మించాలని కోరుకుంటున్న అన్నారు.

నిర్మాత నరేష్ రెడ్డి.జి మాట్లాడుతూ….హైదరాబాద్ లోని విఠల్ వాడి అనే ఏరియాలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకొని ఈ సినిమా నిర్మించాము. కథ, కథనాలు ఈ సినిమాలో కొత్తగా ఉంటాయి. పాటలు, ఫైట్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తారని నమ్మకం ఉంది. త్వరలో ఈ సినిమా టీజర్ ను విడుదల చేస్తాము అన్నారు.

హీరో రోహిత్ మాట్లాడుతూ… మా సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసిన జగపతిబాబు గారికి ధన్యవాదాలు. విఠల్ వాడి సినిమాతో హీరోగా పరిచయం అవ్వడం సంతోషం. నిర్మాత నరేష్ రెడ్డి గారు బాగా ఖర్చు పెట్టి సినిమాను క్వాలిటీ గా నిర్మించారు. ఈ మూవీ మా అందరికి మంచి పేరు తెచ్చిపెడుతుందని నమ్ముతున్నాము అన్నారు.

దర్శకుడు టి.నాగేందర్ మాట్లాడుతూ… మా సినిమా ప్రమోషన్ జగపతిబాబు గారితో మొదలవ్వడం సంతోషం.
విఠల్ వాడి కథ నిజ జీవితంలో జరిగిన ఒక యదార్ధ ప్రేమకథ . చిత్రీకరణ దాదాపు పూర్తి అయ్యింది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు మీడియాతో త్వరలో పంచుకుంటాము అన్నారు.

నటీనటులు
రోహిత్, సుధ రావత్, అమిత్, అప్పాజీ అంబరీష్ దర్బా, చమ్మక్ చంద్ర, జయశ్రీ, రోల్ రైడ

సాంకేతిక నిపుణులు
కెమెరామెన్: సతీష్ అడపా
మ్యూజిక్: రోషన్ సాలూరు
ఎడిటర్: శ్రీనివాస్ కె.మోపర్తి
ఫైట్స్: శంకర్.యు
కొరియోగ్రఫీ: అమిత్ మనోహర్
లిరిక్స్: ఎస్.ఏ.రెహమాన్, పూర్ణ చారి
కో.డైరెక్టర్: శ్రీనివాస్ రెడ్డి
డైరెక్టర్: నాగేందర్.టి
నిర్మాత: నరేష్ రెడ్డి.జి
పి.ఆర్.ఓ: మధు వి.ఆర్

Loading...