Saturday, April 27, 2024
- Advertisement -

100 కోట్ల క్ల‌బ్‌లో ‘కాంచ‌న -3’

- Advertisement -

ప్ర‌ముఖ డ్యాన్స్ మాస్ట‌ర్ లారెన్స్ హీరోగా న‌టిస్తున్న కాంచ‌న సిరీస్ బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యాలు సాధించాయి. తాజాగా కాంచ‌న సిరీస్ నుంచి వ‌చ్చిన కాంచ‌న -3 సినిమా కూడా సూప‌ర్ హిట్ అయింది. గ‌త శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన కాంచ‌న -3 విడుదల అయిన మొద‌టి షో నుంచే హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 2600 థియేటర్స్ లో ఈ సినిమాను రిలీజ్ చేశారు. త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో విడుద‌ల అయిన ఈ సినిమా బి – సి సెంటర్స్ లో భారీ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది.

తొలివారం రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల మార్క్ ను క్రాస్ చేసేసింది. దీనికి సంబంధించిన అఫిషియ‌ల్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ సినిమాలో లారెన్స్ సరసన వేదిక .. ఓవియా.. నిక్కీ తంబోలి కథానాయికలుగా నటించారు. సినిమా స‌క్సెస్‌లో లారెన్స్‌దే కీ రోల్ పోషించారు. ఈ సినిమా ఇంతటి ఘన విజయాన్ని సాధించడంతో, ‘కాంచన 4’కి లారెన్స్ ప్లాన్ చేస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -