Saturday, April 27, 2024
- Advertisement -

భాజాపా లో అడుగుపెడుతున్న వివాదాస్పద నటి

- Advertisement -

వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ లాగా అవతరించిన కంగనా రనౌత్ ప్రస్తుతం తన కెరీర్ లో బెస్ట్ ఫేజ్ ని ఎంజాయ్ చేస్తుంది. ఇటీవలే రాజ్ కుమార్ రావ్ తో కలిసి జడ్జ్ మెంటల్ హాయ్ క్యా అనే సినిమా లో కూడా నటించింది. అయితే ఎప్పటి నుంచో కంగనా రాజకీయాల్లోకి వెళ్తుంది అనే టాక్ వినిపిస్తున్న నేపథ్యం లో ఇప్పుడు కంగనా నిజం గా నే వెళ్తుంది అని కొందరు బాలీవుడ్ రిపోర్టర్లు కన్ఫర్మ్ చేస్తున్నారు. అయితే కంగనా రనౌత్ ని ఇప్పటికే పలు జాతీయ పార్టీల ప్రతినిధులు అప్రోచ్ అయినప్పటికీ ఆమె ఒక నిర్ణయానికి రావడానికి సమయం తీసుకుందట.

అయితే ఇప్పుడు వినిపిస్తున్న కథనాల ప్రకారం కంగనా రనౌత్ భారతీయ జనతా పార్టీ లో కి అడుగు పెట్టబోతోంది అని సమాచారం. కంగనా లాంటి వివాదాస్పద నటి ఆ పార్టీ లో ఉండటమే మంచిది అని చాలా మంది భావిస్తున్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అంటే కంగనా కి ముందు నుంచి సదాభిప్రాయమే ఉందట. అందుకని ఇప్పుడు త్వరలో నే అధికారికం గా భాజపా లో కి వెళ్లాలి అని ఆమె నిర్ణయించుకున్నట్టు ఆవిడ సన్నహిత వర్గాలు తెలుపుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -