మొద‌టి రోజు క‌లెక్ష‌న్ల‌లో కింగ్ ఎవ‌రు..?

1580
Kathanayakudu (VS) vinaya vidheya rama first day collections
Kathanayakudu (VS) vinaya vidheya rama first day collections

ఈ సంక్రాంతికి మెగా ఫ్యామిలీ నుంచి ఓ సినిమా, నంద‌మూరి ఫ్యామిలీ నుంచి మ‌రో సినిమా వ‌చ్చింది. దీంతో ఈ పండుగ‌ మెగా,నంద‌మూరి ఫ్యాన్స్‌ వార్‌గా మారింది. బాల‌య్య ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో న‌టించిన ‘క‌థానాయకుడు’తో రాగ‌, విన‌య విధేయ రామతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు రామ్ చ‌ర‌ణ్.మొద‌ట‌గా బాల‌య్య న‌టించిన క‌థానాయ‌కుడు సినిమా విడుద‌ల కాగా , త‌రువాత రెండు రోజులకు గాను రామ్ చ‌ర‌ణ్ ‘విన‌య విధేయ రామ’ విడుద‌లైంది. అయితే ఈ రెండు సినిమాల‌కు నెగిటివ్ టాక్‌ రావ‌డం విశేషం. ఈ రెండు సినిమాలు అనుకున్నంత రేంజ్‌లో లేవ‌ని ఫ్యాన్సే చెబుతున్నారు అంటే అర్థం చేసుకోవాలి. ఇక రెండు సినిమాల మొద‌టి రోజు క‌లెక్ష‌న్లు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం.

బాల‌కృష్ణ క‌థానాయ‌కుడు సినిమా మొద‌టి రోజున రూ.9 కోట్లు క‌లెక్ట్‌ చేసినట్లు సమాచారం. ఓవ‌రాల్‌గా ఈ సినిమా మొద‌టి రోజున పదిహేను కోట్లు గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా తొమ్మిది కోట్ల షేర్ ని రాబట్టిందని సినీ పండితులు తెలిపారు.

రామ్ చ‌ర‌ణ్ న‌టించిన వినయ విధేయ రామ సినిమా మొద‌టి రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో 26 కోట్ల షేర్‌ను అందుకుందని తెలుస్తోంది.

ఒక్క‌సారి ఏరియాల వారిగా ఈ రెండు సినిమాలు ఎంతెంత క‌లెక్ట్ చేశాయో చూద్దాం.

బాల‌కృష్ణ క‌థానాయ‌కుడు
నైజాం………………………………1.75 కోట్లు
గుంటూరు…………………………2.05 కోట్లు
నెల్లూరు……………………………0.55 కోట్లు
వైజాగ్……………………………….0.87 కోట్లు
కృష్ణ………………………………….0.72 కోట్లు
వెస్ట్……………………………………0.45 కోట్లు
ఈస్ట్……………………………………0.50 కోట్లు
సీడెడ్………………………………….2.11 కోట్లు

మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా రూ.9 కోట్ల రూపాయలను వసూలు చేసింది.

రామ్ చ‌ర‌ణ్ వినయ విధేయ రామ
నైజాం.. 5.08 కోట్లు
సీడెడ్..7.20 కోట్లు
నెల్లూరు…1.6 9కోట్లు
గుంటూరు..4.18 కోట్లు
కృష్ణా…1.59కోట్లు
పశ్చిమ గోదావరి…1. 83 కోట్లు
తూర్పు గోదావరి…2.05 కోట్లు
ఉత్తరాంధ్ర….2.45కోట్లు
ఏపీ, తెలంగాణ మొత్తం షేర్..26.07 కోట్లు
నైజాం.. 5.08 కోట్లు
సీడెడ్..7.20 కోట్లు
నెల్లూరు…1.6 9కోట్లు
గుంటూరు..4.18 కోట్లు
కృష్ణా…1.59కోట్లు
పశ్చిమ గోదావరి…1. 83 కోట్లు
తూర్పు గోదావరి…2.05 కోట్లు
ఉత్తరాంధ్ర….2.45కోట్లు
ఏపీ, తెలంగాణ మొత్తం షేర్..26.07 కోట్లు వ‌సూలు చేసింది.

ఈ రెండు సినిమాల‌లో రామ్ చ‌ర‌ణ్ సినిమాకు ఎక్కువ క‌లెక్ష‌న్లు వ‌చ్చాయి. అయితే బాల‌కృష్ణ సినిమా క‌న్నా రామ్ చ‌ర‌ణ్ సినిమా ఎక్కువ థియోట‌ర్ల‌లో విడుద‌ల కావ‌డం వ‌ల్ల క‌లెక్ష‌న్లలో తేడా ఉన్నాయి. క‌లెక్ష‌న్లు ఎలా ఉన్నా సంక్రాంతికి విడుద‌లైన ఈ రెండు సినిమాలు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డంలో ఫెయిల్ అయ్యాయి.