Saturday, April 27, 2024
- Advertisement -

ఆర్జీవి సినిమా అందుకే ఫ్లాప్ అయిందా..!

- Advertisement -

ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా గా బాలకృష్ణ తీసిన రెండు భాగాలు పక్కన పెడితే కాంట్రవర్షియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే సినిమాను తీసిన సంగతి తెలిసిందే. టైటిల్ కు తగ్గట్టు గా లక్ష్మీపార్వతి ఎంట్రీ నుంచి ఎన్టీఆర్ జీవితం మీద ఈ సినిమా తీశాడు ఆర్జీవి. మిగతా రాష్ట్రాల్లో ఈ సినిమా ఎన్నికలకు ముందే విడుదలైనప్పటికీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈ సినిమా ఎన్నికలు పూర్తయిన దాదాపు నెల తర్వాత విడుదలైంది. దానికి కారణం అప్పట్లో రూలింగ్ పార్టీ అయిన టిడిపి ఈ సినిమా కి వ్యతిరేకంగా మారడం. ఈ సినిమా చంద్రబాబు నాయుడు వల్ల ఎన్టీఆర్ జీవితం నాశనం అయినట్లు చూపించిందని వారి ఆరోపణ. ఏదేమైనా సినిమా విడుదలైనా ప్రేక్షకుల నుంచి పెద్దగా రెస్పాన్స్ ను అందుకోలేకపోయింది.

ఇప్పటికీ ఎన్నికలు పూర్తి అయిపోయాయి. దాని ఫలితాలు కూడా వచ్చేశాయి. చంద్రబాబు నాయుడు మీద వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిచి సీఎం కుర్చీలో కూర్చున్నారు. ఇక ప్రేక్షకులలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా పైన ఆసక్తి పూర్తిగా పోయింది. ఒక వైపు టీడీపీ అభిమానులు ఎన్నికలకు ముందే విడుదలైనప్పటికీ సినిమా ఫలితం అలానే ఉండేదని అంటున్నారు. ఈ సినిమా విడుదల అవ్వక పోయినప్పటికీ మామూలుగానే ప్రజలకు చంద్రబాబు పై నెగటివ్ ఫీలింగ్ వచ్చేయడంతో జగన్ కి సింపతీ వర్కవుట్ అయ్యి ఓట్లు పడ్డాయని మరి కొందరు అంటున్నారు. ఏదేమైనా ఒకవేళ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ఎన్నికల ముందు విడుదల అయినప్పటికీ పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండేది కాదని సినీ విశ్లేషకుల అంచనా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -