Friday, April 26, 2024
- Advertisement -

ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైల‌ర్…చంద్ర‌బాబునే టార్గెట్ చేసిన వ‌ర్మ‌

- Advertisement -

తెలుగు వెండితెర దైవంగా భావించే ఎన్టీఆర్ జీవత క‌థ‌పై ఇప్ప‌టికే చాలా క‌థ‌లు తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న త‌య‌యుడు హీరో బాల‌కృష్ణ తన తండ్రి జీవిత క‌థ‌ను రెండు పార్ట్‌లుగా తెర‌కెక్కించారు. ఇప్ప‌టికే మొద‌టి పార్ట్ క‌థా నాయ‌కుడు విడుద‌ల కాగ‌, రెండో పార్ట్ మ‌హ‌నాయ‌కుడును విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఇక వివాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ కూడా ఎన్టీఆర్ రెండో భార్య ల‌క్ష్మీ పార్వ‌తి ఆయ‌న జీవితంలోకి ప్ర‌వేశించిన ద‌గ్గ‌ర నుంచి ఓ సినిమాను తెర‌కెక్కించారు. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో తీస్తోన్న ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు రామ్ గోపాల్ వ‌ర్మ‌.

ఈవిడ పేరు లక్ష్మీ పార్వతి నా జీవిత చరిత్ర రాస్తున్నారు అంటూ త‌న కుటుంబ స‌భ్యుల‌తో పాటు , పార్టీ నాయ‌కులుకు ప‌రిచియం చేస్తారు ఎన్టీఆర్‌. అప్ప‌టి నుంచి ఆయన జీవితంలో చోటు చేసుకున్న సంఘ‌ట‌ల‌ను ట్రైల‌ర్‌లో చూపించాడు వ‌ర్మ‌. జీవితం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుందో,ఎవరికీ అర్ధం కాదు, అంటూ ఎన్టీఆర్.. లక్ష్మీపార్వతితో చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఈ వయసులో కూడా మీకు ఆడతోడు అవసరమా… అంటూ హరికృష్ణ, ఎన్టీఆర్‌ను ప్రశ్నించడానికి ప్రయత్నిస్తే దానికి ఎన్టీఆర్ సీరియస్ అవ్వడం ట్రైల‌ర్‌లో చూపించారు. చంద్ర‌బాబు ఎన్టీఆర్ ఫ్యామిలీతో మాట్లాడుతు దానికిగాని కొడుకు పుడితే మీ ఫ్యామిలీ ఫినిష్ అని చెప్ప‌డం మ‌నం ట్రైల‌ర్‌లో కూడా చూడ‌వ‌చ్చు.

ట్రైల‌ర్ చివర్లో ఎన్టీఆర్‌పై చంద్ర‌బాబు చెప్పులు వేసే సీన్‌,వాడిని న‌మ్మి నేను చాలా పెద్ద త‌ప్పు చేశాను అని ఎన్టీఆర్ అనే సీన్ ట్రైల‌ర్‌కే హైలెట్‌గా నిలిచాయి. ట్రైల‌ర్‌లో ఎవ‌రు గ‌మనించని విష‌యం ఏమిటంటే మోహ‌న్ బాబు. ట్రైల‌ర్‌లో మోహ‌న్ బాబుని కూడా చూపించాడు వ‌ర్మ‌. ఈ సినిమాలో మోహ‌న్‌బాబును నెగిటివ్‌గా చూపిస్తున్నార‌ని టాక్‌.


Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -