Friday, April 26, 2024
- Advertisement -

వెంకీని పొగిడి వ‌రుణ్‌ని మ‌ర‌చిన మ‌హేశ్ బాబు

- Advertisement -

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు తన మనస్సుకు నచ్చిన సినిమాని అభినందించంటలో ముందుంటాడు.తాజాగా విడుదల అయిన ఎఫ్‌2 టీజ‌ర్‌పై ప్ర‌శంస‌లు కురిపించాడు మ‌హేశ్ బాబు.ఎఫ్2 టీజ‌ర్ చూసిన వెంట‌నే మ‌హేశ్ బాబు ట్వీట్ చేశాడు.చాలా ఫన్ గా ఎంటర్టైన్మెంట్ తో ఉందని, వెంకటేష్ టెర్రిఫిక్ అని ఆయన కితాబు ఇచ్చారు. అయితే ఈ సినిమాలో వెంక‌టేశ్‌తో పాటు మెగా హీరో వ‌రుణ్ తేజ్ కూడా ఈ సినిమా న‌టించాడు.

వ‌రుణ్‌పై ఎటువంటి కామెంట్స్ చేయ‌లేదు మ‌హేశ్ బాబు.వరుణ్‌ని కావ‌ల‌నే మ‌రిచిపోయాడా లేక సినిమా యూనిట్‌తో క‌లిపి అత‌నిని చూశాడా అనేది తెలియాల్సి ఉంది.ఎది ఏమైన‌ప్ప‌టికి ఇద్ద‌రు హీరోలు క‌లిసి న‌టించిన సినిమాలో ఒక‌రిని పొగిడి మ‌రోకరిని ఇలా మ‌ర్చిపోతే ఎలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజ‌న్లు.ఈ విష‌యంలో మ‌హేశ్‌పై గుర్రుగా ఉన్నారు మెగా ఫ్యాన్స్‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -