Saturday, April 27, 2024
- Advertisement -

మనోజ్ విడాకులు.. ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోబోతున్నాడా ?

- Advertisement -

సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉండే హీరోల్లో మంచు మనోజ్ కూడా ఒకరు. ఆయన ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. అభిమానులతో తన కొత్త సినిమా విషయాలు, తన వ్యక్తిగత విషయాలు పంచుకుంటూ ఉంటారు. అంతేకాదు.. అభిమానులు అడిగిన ప్రశ్నలకు జవాబు కూడా ఇస్తూ ఉంటారు. వ్

యక్తిగత కారణాల వల్ల కొద్దికాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. మనోజ్ తాజాగా ట్విటర్‌లో ఓ పోస్ట్‌ చేశారు. ’నేను త్వరలోనే ఫైర్‌ బాల్‌లా మీ ముందుకు రానున్నాను. వారం రోజుల్లోనే ఓ ఆసక్తికర విషయాన్ని మీతో పంచుకుంటాను. వెయిట్‌ చెయ్యండి’ అని పేర్కొన్నారు. దీంతో చాలా మంది నెటిజన్లు ఆయనకు ఆల్‌ ది బెస్ట్‌ చెబుతూ ఆ పోస్ట్ కింద కామెంట్స్ చేశారు. అయితే కొందరు మాత్రం.. కొత్త సినిమా ప్రారంభిస్తున్నారా?, మరో పెళ్లి చేసుకుంటున్నారా? అని మనోజ్‌ను ప్రశ్నించారు.

అందులో నరేష్‌ మిర్యాల అనే ట్విటర్‌ యూజర్‌ ప్రశ్నకు మనోజ్‌ సమాధానం ఇచ్చారు. ఇంకో మ్యారేజ్‌? అని నరేశ్‌ అడగ్గా.. మనోజ్‌ వామ్మో అంటూ సమాధానమిచ్చారు. కాగా, 2015లో మనోజ్‌, ప్రణతిరెడ్డిల పెళ్లి జరగగా.. గతేడాది వారిద్దరు విడాకులు తీసుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -