‘సీసీసీ’కి బాలయ్య విరాళం ఎంతో తెలుసా?

350
Nandamuri Balakrishna Donates Rs 1 Crore 25 Lakhs To Fight Corona Virus
Nandamuri Balakrishna Donates Rs 1 Crore 25 Lakhs To Fight Corona Virus

ప్రస్తుతం కరోనా పేరు చెబితినే ప్రపంచం గజగజ వణికిపోతుంది. ఈ కరోనా దాటికి యావత్ ప్రపంచ దేశాలు ఇబ్బందులు పడుతున్నారు. చైనాలో సోకిన ఈ వైరస్ క్రమంగా అన్నిదేశాలకు పాకింది. భారత్ లోనూ రోజుకురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో కేంద్రం లాక్డౌన్ అమలు చేస్తుంది. దీంతో ప్రజారవాణ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. అలాగే సినిమా షూటింగ్, సినిమా థియేటర్లు మూతపడటంతో సినీ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు.

తాజాగా సినీ కార్మికులను ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ‘కరోనా క్రైసిన్ ఛారిటీ’ ఏర్పాటైన సంగతి తెల్సిందే. ఈ ఛారిటీకి సినీ స్టార్లంతా విరాళాలను ప్రకటిస్తూ తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. తాజాగా నటసింహం నందమూరి బాలకృష్ణ ‘సీసీసీ’కి రూ.25లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కును ‘సీసీసీ’ ఎగ్జిక్యూటీవ్ మెంబర్ సి.కల్యాణ్ కు బాలయ్య అందజేశారు.

అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాలకు రూ.50లక్షల చొప్పున విరాళాలను ప్రకటించారు. ‘సీసీసీ’కి రూ.25లక్షలు ప్రకటించారు. దీంతో మొత్తంగా రూ.1.25కోట్ల రూపాయాలను కరోనా నివారణకు హిందూపురం ఎమ్మెల్యే, నటసింహం బాలకృష్ణ అందజేసినట్లు అవుతుంది. అదేవిధంగా కరోనా ఎఫెక్ట్ నేపథ్యంలో ఆయన స్వీయనియంత్రణ పాటిస్తూ ఇంట్లో ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. కరోనా విపత్తును అందరూ ధైర్యంగా ఎదుర్కొవాలని పిలుపునిచ్చారు.

Loading...