Friday, April 26, 2024
- Advertisement -

కెమెరా కంటికి చిక్కిన స్టార్ హీరో కొడుకు

- Advertisement -

ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోల కొడుకులు ఇండస్ట్రీలో హీరోలుగా అడుగు పెట్టి మంచి పేరు సంపాదించుకున్నారు. అయితే నందమూరి అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తోంది మాత్రం నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం. గతంలో మోక్షజ్ఞ ఈ సినిమాతో అరంగేట్రం చేయనున్నాడు ఆ సినిమాతో అరంగేట్రం చేయనున్నాడు అంటూ బోలెడు పుకార్లు బయటకు వచ్చాయి. కానీ మోక్షజ్ఞ మాత్రం ఇంకా హీరోగా పరిచయం కాలేదు. ఇక కొడుకు ఎంట్రీ గురించి బాలకృష్ణ ఎప్పుడు క్లారిటీ ఇస్తారు అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మోక్షజ్ఞ అరంగేట్రం గురించి క్లారిటీ ఇంకా రాలేదు కానీ మోక్షజ్ఞ ఫోటో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా కారులో వెళుతున్న మోక్షజ్ఞ తన స్నేహితులకు చేయి ఊపుతూ కనిపించాడు. ఎప్పుడూ మీడియాకి కూడా దూరంగా ఉండే మోక్షజ్ఞ ఎట్టకేలకు కెమెరా కంటికి చిక్కాడు. దానికి సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. వెండితెరపై చూడలేకపోయినా సోషల్ మీడియాలో అయినా మోక్షజ్ఞ ని చూస్తున్నందుకు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బాలకృష్ణ తన తదుపరి సినిమా ‘జైసింహ’ ఫేమ్ దర్శకుడు కె.యస్.రవికుమార్ తో చేయబోతున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -