మహేష్ ఋణం తీర్చుకుంటున్న నాని

181
Nani locked as Chief Guest for Mahesh Babu Maharshi 50 days Celebrations
Nani locked as Chief Guest for Mahesh Babu Maharshi 50 days Celebrations

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవలే నటించిన చిత్రం మహర్షి. వంశీ పైడిపల్లి దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా పెద్ద విజయం సాధించిన విషయం మనకి తెలిసిందే. ఈ సినిమా లో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా పెద్ద విజయం సాధించడం తో చిత్ర యూనిట్ మహర్షి విజయోత్సవాలని ఘనం గా జరుపుకున్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా యాభై రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భం గా 50 రోజుల వేడుక ని చిత్ర యూనిట్ చేసుకుంటున్నారు. అయితే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి యూత్ లో ఫాలోయింగ్ ఉన్న విజయ్ దేవరకొండ రాగా ఇప్పుడు ఈ వేడుక కి నాని అతిధి గా వస్తున్నాడు.

అయితే ఆసక్తికరం అంశం ఏంటి అంటే ఒకప్పుడు, కృష్ణగాడి వీర ప్రేమ గాధ సినిమా కి ఒక ఈవెంట్ చేస్తే, దానికి మహేష్ హాజరయి చిత్ర యూనిట్ ని విష్ చేశాయి. ఇప్పుడు నాని కి మహేష్ బాబు ఋణం తీర్చుకొనే అవకాశం రావడం తో ఆ పని చేస్తున్నాడు.

ఇక త్వరలోనే మహేష్ అనిల్ రావిపూడి దర్శకత్వం లో సరిలేరు నీకెవరు అనే సినిమా ని చేయనున్నారు.

Loading...