Saturday, April 27, 2024
- Advertisement -

ఆ వ్య‌క్తితో మాత్ర‌మే డేటింగ్ చేస్తాను – నిహారిక‌

- Advertisement -

మెగా హీరోలు ఎంత‌మంది ఉన్నా అంద‌రి క‌ళ్లు మెగా హీరోయిన్ నిహారిక మీదనే ఉంటాయి. నిహారిక హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వ‌డ‌మే ఓ సంచ‌ల‌నం అని చెప్పాలి. ఇండ‌స్ట్రీలో ఆడ‌పిల్ల‌ను హీరోయిన్‌గా పంపిచ‌డానికి ఎవ్వ‌రు స‌ముఖుత వ్య‌క్తం చేయ‌రు. కాని నిహారిక హీరోయిన్ అవుతానంటే మెగా ఫ్యామిలీలో ఎవ‌రు పెద్దగా అడ్డంగి చెప్ప‌లేదు. కాని వెండితెర మీద నిహారిక అనుకున్నంత స‌క్సెస్ కాలేద‌ని చెప్పాలి.

ఆమె న‌టించిన సినిమాలు అన్ని బాక్సాఫీస్ వ‌ద్ద ఫ్లాప్‌గా నిలిచాయి. నిహారిక తెలుగు, త‌మిళ భాష‌ల‌లో న‌టించిన‌ప్ప‌టికి హిట్ మాత్రం రాలేదు. నిహారిక తాజాగా న‌టించిన చిత్రం సూర్యకాంతం. ఈ సినిమా ఈ నెల 29న విడుద‌ల కానుంది. సినిమా విడుద‌ల ద‌గ్గ‌ర ప‌డటంతో ప్ర‌మోష‌న్స్‌ను ప్రారంభించింది నిహారిక‌. ఇందులో భాగంగా ’60 సెకండ్స్ విత్ నిహారిక’ కార్యక్రమంలో తనకు వచ్చిన పలు ప్రశ్నలకు ఆమె చిలిపి సమాధానాలు ఇచ్చారు. దీనిలో భాగంగా ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చింది నిహారిక‌. నేను డేటింగ్ చేయాల్సి వ‌స్తే నా మాటల‌ను ఓపికగా వినే వ్యక్తిని ఎంచుకుంటాన‌ని చెప్పుకొచ్చింది.

నేను బాగా మాట్లాడ‌తుంటాన‌ని నా మాట‌ల‌కు విసుక్కోకుండా ఉండే వ్య‌క్తితో డేటింగ్ చేయ‌డానికి రెడీ అని హింట్ ఇచ్చింది నిహారిక‌. నేను బాగా వాడే ప‌దాల‌లో ఫ‌స‌క్ కూడా ఒక‌ట‌ని ఈ సంద‌ర్భంగా తెలిపింది. గ‌తంలో ఒక సారి రెండు రోజులు స్నానం చేయకుండా ఉన్నానంటూ చిలిపిగా స‌మాధానాలు ఇచ్చింది నిహారిక‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -