Friday, April 26, 2024
- Advertisement -

విశాల్ పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్

- Advertisement -

తెలుగు వాడైన విశాల్ టాలీవుడ్ లో కంటే కోలీవుడ్ లో హీరోగా బాగా పాపులర్ అయ్యాడు. అతని డబ్బింగ్ సినిమాలకు ఇక్కడ కూడా మంచి మార్కెట్ ఉంది. అయితే గత కొంత కాలంగా విశాల్ ఎదో ఒక రూపంలో లీగల్ ప్రాబ్లమ్స్ ని ఎదురుకుంటూనే వస్తున్నాడు. నడిగర్ సంఘం జనరల్ సెక్రెటరీ గా వ్యవహరిస్తున్న విశాల్ పై మళ్ళీ ఒక కేస్ నమోదైంది. కార్యానిర్వాహక వర్గాల వారికి జీతాలకు సంబంధిచిన పన్నులు మరియు టీడీఎస్ విషయాల్లో అవకతవకలు వచ్చాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఐ టి అధికారులు విచారణ చేపట్టి ఎంక్విరీ కోసం విశాల్ హాజరుకావలసిందిగా పలుమార్లు నోటీసులు పంపారు. కానీ విశాల్ ఏమాత్రం స్పందించక పోవడంతో ఐటీ అధికారులు చెన్నై లోని ఎగ్మూర్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఎగ్మూర్ కోర్ట్ ఈసారి విశాల్ విచారణకు రాకపోతే అతనిపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేస్తామని తీర్పునిచ్చి పునర్విచారణను ఈనెల 28కి వాయిదా వేశారు. ఇక సినిమాల పరంగా విశాల్ ప్రస్తుతం సుందర్ సి దర్శకత్వంలోఒక సినిమాలో నటిస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -