Friday, April 26, 2024
- Advertisement -

పూర్తిగా చంద్ర‌బాబులా మారిన రానా

- Advertisement -

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి ,న‌టుడు నంద‌మూరి తార‌క రామారావు జీవిత క‌థ‌ను ఎన్టీఆర్ అనే పేరుతో సినిమాగా తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే.ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర‌ను ఆయ‌న త‌న‌యుడు బాలకృష్ణ పోషిస్తున్నారు.ఈ సినిమాకు ఆయ‌నే నిర్మాత కావ‌డం మ‌రో విశేషం.క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలోఎన్టీఆర్ అల్లుడు నారా చంద్ర‌బాబు పాత్ర‌ను హీరో రానా చేస్తున్నాడు.తాజాగా సినిమాలోని రానాకు సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌.

వినాయకచవితి సందర్భంగా సినిమాలో రానా లుక్ ని విడుదల చేశారు. రానా.. చంద్రబాబు నాయుడు పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు గెటప్ లో రానా లుక్ చాలా సింపుల్ గా కనిపిస్తుంది. మీసం పెట్టి కొత్తగా కనిపించడానికి ప్రయత్నించాడు. ఈ పోస్టర్ బ్యాక్ డ్రాప్ లో ఎన్టీఆర్ ఫోటో కూడా కనిపిస్తుంది.వారాహి బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమాలో విద్యాబాలన్ బసవతారం పాత్ర పోషిస్తుండగా.. ఏఎన్నార్ పాత్రలో సుమంత్, ఎస్వీఆర్ పాత్రలో నాగబాబు వంటి నటులు కనిపించబోతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -