Saturday, April 27, 2024
- Advertisement -

సాహో లో అదొక్కటే డ్రా బాక్?

- Advertisement -

యుంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు శ్రద్ధ కపూర్ కలిసి నటిస్తున్న చిత్రం సాహో. రన్ రాజా రన్ సినిమా తో విజయం సాధించిన సుజీత్ ఈ సినిమా కి దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా ఒకేసారి విడుదల కావడం విశేషం. ఇప్పటికే ఆగస్టు 15 విడుదల తేదీ అని నిర్ణయించిన చిత్ర యూనిట్ ఆలోపు సినిమా ని పూర్తి చేయాలనే తలంపు తో పని చేస్తుంది.

ఇకపోతే ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు మీడియా లో ఏదో ఒక వార్త వైరల్ అవుతుంది. ఇటీవలే టీజర్ విడుదల అయ్యి ఎంత పెద్ద పాజిటివ్ టాక్ సంపాదించుకుంది అనేది మన అందరికీ అర్ధం అయింది. అయితే ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ లో వినిపిస్తున్న కథనాల ప్రకారం ఈ సినిమా కమర్షియల్ గా మంచి విజయం సాధిస్తుంది అంట. కాకపోతే సినిమా లో కామెడీ తాలూకు సీన్లు చాలా తక్కువ ఉన్నాయని, స్పెషల్ గా కామెడీ ట్రాక్ ఏమి లేదు అని, కేవలం ఉన్న పాత్రల సంభాషణల వలన పుట్టే కామెడీ నే చిత్ర యూనిట్ నమ్ముకున్నారని తెలుస్తుంది.

ఇంత పెద్ద సినిమా ని పలు భాషల్లో విడుదల చేస్తున్నారు కాబట్టి, కాస్తో కూస్తో కామెడీ కూడా ఉంటే బాగుంటుంది అని కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ అసలు సినిమా లో నిజానికి ఏ మేరకు కామెడీ ఉంది అనేది విడుదల అయితే కానీ క్లారిటీ రాదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -