Saturday, April 27, 2024
- Advertisement -

టీజ‌ర్ చూస్తే మ‌తిపోతుంది..!

- Advertisement -

త‌మిళ సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ వ‌రుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు.కబాలి,క‌లా,2.0 ఇలా వ‌రుస సినిమాల‌తో అభిమానుల‌ను అల‌రిస్తున్నాడు.తాజాగా ర‌జినీకాంత్ న‌టిస్తున్న పెటా సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌లకు సిద్దం అవుతుంది.ఈ రోజు ర‌జినీకాంత్ పుట్టిన రోజు కావడంతో పేటా టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌.టీజ‌ర్ చూస్తున్నంత సేపు అంద‌రికి పాత ర‌జినీ గుర్తుకువ‌చ్చాడు. రజినీకాంత్ తన మేనరిజంతో స్టైలిష్ గా నడుచుకుంటూ వచ్చే సీన్ తో టీజర్ మొదలైంది. మాటలు లేకుండా కేవలం రజినీకాంత్ స్టైల్, లుక్స్ నే ప్రధానంగా చేసుకొని టీజర్ ని కట్ చేశారు.

అభిమానులతో కలిసి తలైవా డాన్స్ చేయడం, అద్దం ముందు నిలబడి స్టైల్ గా కళ్లజోడు పెట్టుకుంటూ రజినీకాంత్ ఇచ్చిన స్మైల్ టీజర్ కి హైలైట్ గా నిలిచింది. టీజ‌ర్‌లో వ‌చ్చే నేపధ్య సంగీతం టీజ‌ర్‌ను బాగా హైలెట్ చేసింద‌ని చెప్పాలి. సిమ్రాన్, త్రిషలు హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ సినిమాలో . విజయ్ సేతుపతి విలన్‌గా న‌టిస్తున్నాడు.కార్తిక్ సుబ్బరాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి విడుద‌ల చేయ‌నున్నారు.



Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -