ఎమోషనల్ టచ్ తో.. ‘లవ్ స్టోరీ’ టీజర్ అదిరింది!

- Advertisement -

టాలీవుడ్ ఫ్యాిమలీ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్ లు గా నటిస్తున్న సినిమా “లవ్ స్టొరీ”.  ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ అయ్యింది. ఈ టీజర్ విషయానికి వస్తే లైఫ్‌‌లో సెటిల్ కావడం కోసం ఇటు నాగ చైతన్య, అటు సాయి పల్లవి పడిన కష్టాలు.. వారి మద్య ప్రేమను కూడా శేఖర్ కమ్ముల ఎంతో ఎమోషన్ గా కనెక్ట్ చేసినట్లు కనిపిస్తుంది.

కాగా, ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా పోస్టర్స్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. కుటుంబ భావోద్వేగాలు, ప్రేమ, వినోదం అన్ని అంశాల కలబోతగా ఈ లవ్ స్టోరీ రూపొందించారని టీజర్‌తో చెప్పేశారు. ఫిదా లాంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్న మరో ప్రేమకథ ‘లవ్ స్టోరీ’.

- Advertisement -

త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు మేకర్స్. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇందులో సాయిపల్లవి చైతుతో కలిసి స్ర్కీన్ షేర్ చేసుకుంది. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరించారు.

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...