Saturday, April 27, 2024
- Advertisement -

కూతురు లాంటి హీరోయిన్‌తో రొమాన్స్ చేయ‌ను – ర‌జినీకాంత్‌

- Advertisement -

త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ వ‌రుస సినిమాలు చేస్తు ఫుల్ బిజీగా ఉన్నాడు. క‌బాలి ద‌గ్గ‌ర నుంచి హిట్లు ఫ్లాప్‌ల‌తో సంబంధం లేకుండా వ‌రుస‌ పెట్టి సినిమాలలో న‌టిస్తున్నాడు. ఇటీవ‌లే 2.0, పేట్టా సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ర‌జ‌నీ, తాజాగా మ‌రో సినిమాను లైన్లో పెట్టిన సంగ‌తి తెలిసిందే. స్టార్ డైరెక్ట‌ర్ ఏఆర్ మురుగదాస్‌తో ఓ సినిమా చేస్తున్నాడు ర‌జినీ. ఈ సినిమాకు క‌థ చ‌ర్చ‌లు కూడా పూర్తి అవ్వ‌డంతో షూటింగ్ కూడా మొద‌లు పెట్టేస్తున్నారు. మొద‌టి ఈ సినిమాలో హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ను తీసుకున్నాడు మురుగ‌దాస్‌. తాను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన స‌ర్కార్ సినిమాలో హీరోయిన్‌గా కీర్తినే న‌టించింది.

దీంతో మరోసారి కీర్తికి ఛాన్స్ ఇచ్చాడు మురుగ‌దాస్‌. కాని ఇక్క‌డ ర‌జ‌నీకాంత్ సైడ్ నుంచి స‌మ‌స్య వ‌చ్చింది. ఇక మీద కూతురు నా వ‌య‌స్సులో ఉన్న హీరోయిన్స్‌తో రొమాన్స్ చేయ‌న‌ని చెప్పారు ర‌జినీ. ప్ర‌స్తుతం కీర్తి వ‌య‌స్సు ర‌జినీకాంత్ కూతుర్లు క‌న్నా చిన్న‌దే , కావ‌డంతో ఈ సినిమా నుంచి కీర్తిని త‌ప్పించ‌డం లాంఛ‌న‌మే అంటున్నాయి త‌మిళ ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు. మ‌రి దీనిపై మురుగదాస్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి. అటు కీర్తి కూడా త‌లైవా న‌టించే ఛాన్స్ వ‌స్తే ఎట్టి ప‌రిస్థితుల‌లో వ‌దులుకోకూడ‌ద‌ని భావిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -