Wednesday, May 8, 2024
- Advertisement -

ఇండియాలోనే అత్య‌ధిక క‌లెక్ష‌న్లు సాధించిన హీరోగా ర‌జినీకాంత్‌

- Advertisement -

సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్‌కు ఒక్క త‌మిళంలోనే కాక ఇండియా మొత్తం క్రేజ్ ఉన్న సంగ‌తి తెలిసిందే.ర‌జ‌నీ సినిమాలు విడుద‌ల అవుతుంటే బాలీవుడ్ హీరోలు సైతం త‌మ సినిమాల‌ను వాయిదా వేసుకుంటారు.ఇక తెలుగులో కూడా ర‌జ‌నీకాంత్‌కు మంచి మార్కెట్ ఉంది.ర‌జినీ సినిమాలు విడుద‌ల రోజున‌ కార్పొరేట్ కంపెనీలు సైతం ఆ రోజున సెల‌వు ప్ర‌క‌టించిన సంద‌ర్భాలు చాలానే ఉన్నాయి.ర‌జినీ న‌టించిన గ‌త రెండు సినిమాలు స‌రైన విజ‌యాలు సాధించ‌క‌పోవ‌డంతో తీవ్ర నిరాశ‌లో ఉన్నారు త‌లైవా అభిమానులు.

రోబో 2.0 కోసం అభిమానులు ఎప్ప‌టి నుంచో ఎదురు చూస్తున్నారు.ఇక ఈ రోజే ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.యూనివ‌ర్సల్ క‌థ కావ‌డంతో సినిమాకు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు.ఇక ర‌జ‌నీకి ఇండియా మొత్తం మంచి మార్కెట్ ఉండ‌టంతో సినిమాను భారీ ఎత్తున విడుద‌ల చేశారు.సినిమాకు పాజిటివ్ రెస్ప‌న్స్ రావ‌డంతో క‌లెక్ష‌న్ల మోత మోగించ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.ఓవ‌ర్ఆల్‌గా ఈ సినిమా 180 కోట్లు సాధించిన‌ట్లుగా స‌మాచారం.తెలుగులో దిల్ రాజు, ఎన్వీ ప్రసాద్, యువి క్రియేషన్స్ వారు విడుదల చేయగా, హిందీలో కరణ్ జోహార్ ఈ సినిమాను విడుదల చేశారు.

హిందీ వెర్షన్ తొలిరోజు దాదాపు రూ.25 కొల్తు వసూలు చేయడం ఖాయమని భావిస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చిన వసూళ్లను బట్టి ట్రేడ్ విశ్లేషకులు పాతిక కోట్లు రాబట్టే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. తొలిరోజు అత్య‌ధిక కలెక్ష‌న్లు సాధించిన హీరోగా రికార్డు సృష్టించాడు.ఈ సినిమా క‌లెక్ష‌న్లు ఇదే విధాంగా ఉంటే మాత్రం బాహుబ‌లి రికార్డులు బ్రేక్ కావ‌డం ఖాయం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -