నెగిటివ్ కామెంట్లపై రియాక్ట్ అయిన రకుల్

192
Rakul Preet Singh React on Negative Comments
Rakul Preet Singh React on Negative Comments

నాగార్జున హీరోగా నటించి సూపర్ హిట్ అయిన ‘మన్మధుడు’ సినిమాకి సీక్వెల్ గా ఇప్పుడు ‘మన్మధుడు 2’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే ‘చిలసౌ’ సినిమాతో దర్శకుడిగా మారిన రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ నటించిన అవంతిక పాత్ర టీజర్ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. అయితే ఈ సినిమాలో అవంతిక పాత్రపై బోలెడన్ని నెగిటివ్ కామెంట్లు రావడంతో తాజాగా వీటి పై రకుల్ ప్రీత్ సింగ్ స్పందించింది. తాను ఇలాంటి విషయాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వని ఎందుకంటే తన జీవితంలో తను డీల్ చేస్తున్నా విషయాలు చాలని చెప్పింది రకుల్.

“కొంతమందికి ఎవరో ఒక లపై వేలెత్తి చూపించడం తప్ప మరొక పనేమీ ఉండదు. అందుకే అలా చేస్తుంటారు. కబీర్ సింగ్ సినిమాలో షాహిద్ కపూర్ స్మోక్ చేశాడంటే నిజజీవితంలో కూడా తను స్మోకర్ అని కాదు. తను జస్ట్ తన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేసినట్టు. ‘మన్మధుడు 2’ లో నాకు పాత్ర కూడా అందరు అమ్మాయిలను జెనరలైజ్ చేసి కాదు. అది ఒక చిన్న పాత్ర మాత్రమే దాని గురించి ప్రేక్షకులు అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు” అని క్లారిటీ ఇచ్చింది రకుల్ ప్రీత్. మరి ‘మన్మధుడు’ సినిమా లాగానే ‘మన్మధుడు 2’ కూడా బ్లాక్ బస్టర్ అవుతుందో లేదో చూడాలి.

Loading...