ఐటం సాంగ్‌కు ప‌డిపోయిన ర‌కుల్‌

191
Rakul preeth item song in nani movie
Rakul preeth item song in nani movie

టాలీవుడ్ హీరోయిన్ ర‌కుల్‌కు ఈ మ‌ధ్య పెద్ద‌గా సినిమాలు రావ‌డం లేద‌న్న సంగ‌తి అంద‌రికి తెలిసిందే. త‌క్కువ కాలంలో టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా మారింది. మ‌హేశ్ బాబు, ఎన్టీఆర్ ,బ‌న్ని, రామ్ చ‌ర‌ణ్ వంటి హీరోల‌తో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది ర‌కుల్‌. కాని సీన్ మొత్తం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు అమ్మ‌డు చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. ఆమె న‌టించిన సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా ఫెయిల్ కావ‌డంతో ర‌కుల్‌కు ఎవ‌రు ఛాన్స్‌లు ఇవ్వడం లేదు. ఇటీవ‌ల ఆమె న‌టించిన దేవ్ సినిమా కూడా అట్ట‌ర్ ఫ్లాప్‌గా నిలిచింది. దీంతో ర‌కుల్‌కు ఆఫ‌ర్లు రావ‌డం లేదు. ఇదే స‌రైన స‌మ‌యం అనుకున్న ఓ నిర్మాత ర‌కుల్‌ను ఐటం సాంగ్ చేయాల‌ని కోరార‌ట‌.

నాని -విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఇటీవ‌లే ఓ సినిమా ప్రారంభం అయింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాలోప్రియాంక ఆరుళ్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. ఈ సినిమాలో కథ ప్రకారం ఈ సినిమాలో ఐటెం సాంగ్ ఉంటుందని తెలుస్తోంది. దానికోసం దర్శకనిర్మాతలు స్టార్ హీరోయిన్ రకుల్ ని సంప్రదించినట్లు సమాచారం. అయితే దీనిపై ర‌కుల్ ఎటువంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని తెలుస్తోంది. హీరోయిన్ ఐటం సాంగ్స్ చేస్తే త‌రువాత సినిమాల‌లో అవ‌కాశాలు రావ‌నే ఆలోచ‌న చేస్తుంద‌ట ర‌కుల్. మ‌రి దీనిపై ర‌కుల్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి.