Wednesday, May 8, 2024
- Advertisement -

రామ్ ’రెడ్’ మూవీ టీజర్.. హిట్ ఖాయమే..!

- Advertisement -

హీరో రామ్ పోతినేని గత ఏడాది ఇస్మార్ట్ శంకర్ తో సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా రామ్ హీరోగా కిషోర్ తిరుమల డైరెక్షన్ లో రెడ్ అనే సినిమా తెరకెక్కింది. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని స్రవంతి రవి కిషోర్ నిర్మిస్తున్నారు. ఇక నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తుంది. కాగా ఈ చిత్రం ఏప్రిల్ 9న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఇస్మార్ట్ శంకర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో రామ్ రెండు విభిన్న పాత్రలో కనిపించాడు. అందులో ఒకరు మాస్ మరొకరు క్లాస్. ఇక మూవీ ఓ సస్పెన్సు క్రైమ్ థ్రిల్లర్ గా కనిపిస్తుండగా ఆ క్రైమ్ లో అనుమానితులుగా రామ్ లు ఇద్దరు కనిపిస్తున్నారు. ఒకేలా ఉన్న ఇద్దరు వ్యక్తులలో ఎవరు అసలు క్రిమినల్ అనే ఇన్వెస్టిగేషన్ ప్రధానంగా రెడ్ మూవీ ఉంటుందని ఈ టీజర్ చూస్తే అర్దం అవుతోంది.

ఇక హీరోయిన్ నివేదా పేతురాజ్ పోలీస్ రోల్ కనిపిస్తోంది. మలయాళ నటుడు సంపత్ రాజ్ కీలక రోల్ చేసినట్టున్నాడు. ప్రధానంగా టీజర్ లో మణిశర్మ బీజీఎమ్ ఎక్సలెంట్ అని చెప్పాలి. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఫార్మ్ లోకి వచ్చిన మణిశర్మ మరోసారి రామ్ కు అదే రెంజ్ మ్యూజిక్ ఇచ్చినట్లు అర్దం అవుతోంది. మొత్తంగా రెడ్ మూవీతో రామ్ మరో హిట్ కొట్టేలా ఉన్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -