ట్రైలర్ రివ్యూ: డబ్బుతో కొనలేనిది డబ్బే అంటున్న గ్యాంగ్స్టర్ శర్వానంద్

214
Ranarangam Theatrical Trailer Review
Ranarangam Theatrical Trailer Review

యంగ్ హీరో శర్వానంద్ హీరోగా సుధీర్వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న యాక్షన్ డ్రామా ‘రణరంగం’. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ మరియు కళ్యాణి ప్రియదర్శన్ శర్వానంద్ తో రొమాన్స్ చేయబోతున్నారు. టీజర్ మరియు పాటలతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన దర్శకనిర్మాతలు తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను లాంచ్ చేశారు. రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ట్రైలర్ చూస్తే సినిమా ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఉండబోతోందని తెలుస్తోంది. సినిమాలో ఒక గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపించబోతున్నాడు శర్వా.

1980 లలో ఎన్టీఆర్ సీఎం గా ఉన్నప్పుడు గాంగ్స్టర్ గా మారిన శర్వా ఇప్పుడు ఎలా ఉన్నాడు అనేది ఈ సినిమా కథ అని చెప్పొచ్చు. 80స్ లో కల్యాణి తో ప్రేమలో పడిన శర్వా ప్రెసెంట్ లో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కాజల్ తో రొమాన్స్ చేస్తాడు. ప్రపంచంలో డబ్బుతో కొనలేనిది ఏదైనా ఉంటే అది డబ్బే అనే డైలాగ్స్ చాలా బావున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రశాంత పిళ్ళై సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 15న విడుదలకు సిద్ధం అవుతోంది.

Loading...