రొమాన్స్ లో పిచ్చెక్కించాలి అంటున్న రష్మిక

513
Rashmika Mandanna About Romance
Rashmika Mandanna About Romance

డియర్ కామ్రేడ్ అనే సినిమా లో లిల్లీ అనే పాత్ర ని పోషిస్తుంది రష్మిక. విజయ్ దేవరకొండ సరసన రెండో సారి నటిస్తున్న ఈ హీరోయిన్ సినిమా మీద భారీ ఆశలు పెట్టుకుంది. అయితే ప్రమోషన్స్ లో భాగం గా తన గురించి, తన కుటుంబం గురించి, తన సినిమాలగురించి మీడియా తో మాట్లాడిన రష్మిక తన కాబోయే జీవిత భాగస్వామి ఎలా ఉండాలో తెలిపింది.

“ఆయన ని చూడగానే ఆయన లో చార్మ్ ఉంది అనిపించాలి. ఆయన గురించే నా ఆలోచనలు ఎప్పుడూ ఉండేలా చూడాలి అతను. అంత అందం గా ఉండాలి. రొమాన్స్ లో పిచ్చెక్కించాలి. వయసు లో చిన్నా పెద్ద అనే తేడా నాకు లేదు. అతను ప్రేమ, రొమాన్స్ విషయం లో మాత్రం నేను ఊహించిన విధం గా ఉండాలి, లేదంటే నేను నిరుత్సాహపడతాను.”అని రష్మిక తెలిపింది.

ఇక పోతే ఈ భామ ఇప్పుడు తన దృష్టి ని మొత్తం తన తదుపరి సినిమా డియర్ కామ్రేడ్ పైన ఉంచింది. ఈ సినిమా విజయం మీద రష్మిక చాలా నమ్మకం గా ఉంది. ఇది కనుక హిట్ అయితే, రష్మిక లెవెల్ ఇంకా పెరిగిపోతుంది.

Loading...