కుక్క బిస్కెట్లు తింటున్న హీరోయిన్ రష్మీక..!

1100
Rashmika Mandanna eats dog biscuits
Rashmika Mandanna eats dog biscuits

లొకేషన్ లో ఉన్న్నప్పుడు హీరోయిన్ రష్మీక చలాకీతనంపై సూపర్ స్టార్ తన సరిలేరు నీకెవ్వరు ప్రమోషన్ లో భాగంగా కాంప్లిమెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. సెట్స్ లో సెటైర్లు వేయడం.. పంచ్ వేయడంలో నన్నే మించిపోయింది అంటూ మహేష్ చెప్పాడు. రష్మికలో అప్పటివరకూ బయటి ప్రపంచానికి తెలిసింది తక్కువే. మహేష్ పుణ్యమా అని రష్మిక ఎగ్రెసివ్ క్వాలిటీస్ తో పాటు.. ఎంటర్ టైన్ మెంట్ కోణం కూడా తెలిసిందే.

ప్రస్తుతం యూత్ స్టార్ నితిన్ సరసన భీష్మ చిత్రంలో రష్మీక నటిస్తోంది. ఈ సందర్భంగా వీరిద్దరు పలు చానెల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. సినిమా విశేషాలతో పాటు…వ్యక్తిగత అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో రష్మిక గురించి చెప్పమని నితిన్ ని యాంకర్ అడిగారు. ఎవరైనా ఆకలేస్తే పండ్లతో పాటు.. మనుషులు తినే బిస్కెట్లు.. టిఫిన్ తింటారు. కానీ రష్మిక ఏం తింటుందో తెలుసా? అని నితిన్ చెబుతుండగా రష్మిక మధ్యలో ఎంటరై నితిన్ నోరు నొక్కేసే ప్రయత్నం చేసింది.

ఆ సీక్రెట్ చెప్పొద్దంటూ నితిన్ ని ఎంతగానో బతిమలాడుకుంది. అయినా సరే నితిన్ ఊరుకోలేదు. “రష్మిక కుక్క బిస్కెట్లు తింటుంది” అని టాప్ సీక్రెట్ ని బయటపెట్టాడు. దాంతో కుక్క బిస్కెట్లా? అంటూ యాంకర్ ఆశ్చర్యంగా రష్మిక వైపు చూసి కిల కిలా నవ్వేసారు. ఇక రష్మీక కుక్క బిస్కెట్లు తినడం ఏంటి ? మనుషులు తినే బిస్కెట్లు రష్మీకకు నచ్చట్లేదా ? లేక కుక్క బిస్కెట్లు అంత రుచిగా ఉన్నాయా ? అంటు రష్మీకపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

Loading...