Friday, April 26, 2024
- Advertisement -

జెనీలియా భర్త కదా అని అనేసరి నా ఈగో హర్ట్ అయ్యింది : రితేష్‌

- Advertisement -

‘బాయ్స్’ ‘సత్యం’ ‘బొమ్మరిల్లు’ ‘ఢీ’ ‘సై’ ‘రెడీ’ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది జెనీలియా. ఎన్టీఆర్, అల్లు అర్జున్, వెంకటేష్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో కూడా చేసింది. నార్త్ కు చెందిన అమ్మాయి అయినప్పటికి తెలుగులో ఎక్కువగా క్రేజ్ తెచ్చుకుంది. ఈ విషయాన్ని జెనీలియా కూడా పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది.

తరువాత కొత్త హీరొయిన్ల ఎంట్రీతో జెనిలియాకు అవకాశాలు తగ్గిపోయాయి. ఈ క్రమంలో సినిమాలకు బ్రేక్ ఇచ్చి బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ని 2011లో పెళ్లి చేసుకుంది. అయినా ఆమెకు సౌత్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. ఒకానొక సమయంలో జెనిలియా ఫ్యాన్స్ చేసిన కామెంట్స్ కు ఆమె భర్త రితేష్ కు చాలా కోపం తెప్పించాయట. ఈ విషయాన్ని ఇటీవల కామెడీ విత్‌ కపిల్‌ శర్మ షోలో వివరించాడు. రితేష్‌, జెనీలియా ఇటీవల ఈ షోలో పాల్గొన్నారు.

ఇదిలా ఉండగా.. రితేష్ జెనీలియా ఫ్యాన్స్ గురించి మాట్లాడుతూ.. “బెంగళూరులో నేను క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్ళాను. అక్కడ ఇద్దరు గుసగుసలాడుకోవడం నేను గమనించాను. ఆ టైంలో నేను వాళ్లను చూసినప్పుడు.. ’మీరు జెనీలియా భర్త కదా’ అని అన్నారు. వాళ్ళు అలా అనేసరికి నా ఈగో హర్ట్ అయ్యింది. దాంతో ‘ఇక్కడ నేను జెనీలియా భర్తను అయ్యుండొచ్చు కానీ మహారాష్ట్రలో ఆమె రితేష్‌ భార్య’ అని చెప్పాను. ‘సార్ ఆ ఒక్క రాష్ట్రంలోనే.. జెనీలియాను రితేష్‌ భార్య అంటారు. కానీ కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో మిమ్మల్ని జెనీలియా భర్త అనే అంటారు’ అని కౌంటర్ ఇచ్చారు” అంటూ చెప్పుకొచ్చాడు రితేష్.

ఆ సినిమా ని మళ్ళీ రీస్టార్ట్ చేసిన రామ్..

బిగ్ బాస్ కి వెళ్లినందుకు గంగవ్వకు రూపాయి కూడా ఇవ్వలేదట..!

నాని సినిమా కి కరోనా బ్రేకులు.. ఇప్పుడెలా..

చిరంజీవి కి ఈ అరవ కథల మోజేంటి..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -