Friday, April 26, 2024
- Advertisement -

ఆర్పీ ప‌ట్నాయ‌క్‘ఒక అవ‌కాశం’ వ‌చ్చేసిందే!

- Advertisement -

సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ పేరు విని దాదాపు ఏళ్ల‌య్యి ఉంటుంది. అత‌డు సినిమాల‌కు ప‌ని చేయ‌క చాలా కాల‌మైంది. ఎందుకో ఏమిటో ఎవ‌రికీ తెలియ‌దు. కానీ ఒక‌ప్పుడు మంచి సంగీతం అందించిన అత‌డికి ఇప్పుడు అవ‌కాశాలు ఎందుకు రావ‌డం లేదో అర్థం కాని ప్ర‌శ్నే. సంగీత ద‌ర్శ‌కుడిగా, నటుడిగా కూడా మారాడు. అలాంటి ఆర్పీకి ఇప్పుడు అవకాశాలు అంతగా అందడం లేదు. చిరకాలం నిలిచిపోయే పాట‌లు అందించిన ఆ ద‌ర్శ‌కుడికి ఇప్పుడు ఒక చిన్న అవ‌కాశం వ‌చ్చింది.

అయితే అనుకోకుండా ఆర్పీ ప‌ట్నాయ‌క్‌కు ఓ అవ‌కాశం వ‌చ్చి ప‌డింది. ఈ విష‌యాన్ని ఆర్పీ వెల్ల‌డించాడు. ‘‘ఈ శ్రీరామనవమికి భద్రాచలం వెళ్లాలని నిర్ణయించుకున్నా. ఆల‌యంలో సహస్రార్చన చేయించాలన్నది నా ఆలోచన. అలా ఈ భద్రాచలం టూర్ గురించి మనసులో నిర్ణయించుకున్నానో లేదో.. ఇలా వెంటనే ఓ మంచి అవకాశం తలుపు తట్టింది. ఓ వీడియో సాంగ్‌కు సంగీతం అందించమని నన్ను కోరారు. శంషాబాద్‌కు చేరువలోని అమ్మపల్లి గ్రామంలోని వందేళ్ల పురాతనమైన రామ మందిరంలో షూట్ చేశారంట‌. ఆ ఆల‌యం ఉందనే అప్పుడే విషయం తెలిసింది’’ అని చెప్పుకొచ్చారు.

‘అర్జున్ కొండవీటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ వీడియో సాంగ్ అద్భుతంగా వచ్చింది’ అని ఆర్పీ పట్నాయక్ తెలిపారు. చారిత్రాత్మక ఆలయంలో జరిగే సీతారామ కల్యాణం వేడుకకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరు కావాలని ఈ వీడియో ద్వారా తాను కోరార‌ని ఆర్పీ చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -