Sunday, April 28, 2024
- Advertisement -

రామమందిరంపై విజయేంద్రప్రసాద్‌ మూవీ?

- Advertisement -

విజయేంద్ర ప్రసాద్..భారతీయ సినీ పరిశ్రమకు పరిచయం అక్కర్లేని పేరు. టాలీవుడే కాదు బాలీవుడ్ హిట్ సినిమాలకు కథ అందించారు. దర్శకధీరుడు రాజమౌళి తండ్రి కూడా. ఇక జక్కన్న సినిమాలన్నింటికి కథ అందించేంది విజయేంద్ర ప్రసాదే. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి – మహేష్ బాబు కాంబోలో వస్తున్న సినిమాకు కథ అందిస్తున్నారు విజయేంద్ర ప్రసాద్.

ఇక తాజాగా ఇప్పుడు మరో అద్భుత కథతో ముందుకురాబోతున్నారు. అది అయోధ్య రామమందిరంపై. 5 శతాబ్దాల భారతీయుల కల జనవరి 22న నెరవేరగా ప్రపంచం మొత్తం చూసేలా రామమందిర ప్రారంభోత్సవం జరిగింది. దీనినే వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు విజేయంద్రప్రసాద్. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అయోధ్య రామమందిరంపై సినిమా తీయబోతున్నానని.. బాబ్రీ మసీదు కూల్చీవేత నుండి రామ మందిరం ఏర్పాటు ఏం జరిగింది అనేది సినిమాగా ఉండబోతుందన్నారు. ఈ సినిమా కోసం కంగనా రనౌత్‌తో చర్చించినట్లు వెల్లడించారు.

ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయ్యిందని తెలిపారు. గతంలో ఆర్‌ఎస్‌ఎస్‌ పై కూడా సినిమాని ప్రకటించారు. ఈ మూవీ త్వరలోనే పట్టాలెక్కబోతుండగా అంతలోనే రామందిరంపై సినిమా ప్రకటించి సంచలనం సృష్టించాడు. ప్రస్తుతం ఎస్‌ఎస్‌ఎంబీ29కి స్క్రిప్ట్ అందిస్తుండగా మార్చిలో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -