Friday, April 26, 2024
- Advertisement -

త్రివిక్రమ్ గురించి అతను అలా అనేశాడేంటి

- Advertisement -

సంగీత దర్శకుడిగానే కాకుండా కొన్ని చిత్రాలను డైరెక్ట్ చేసిన వాడిగా ఆర్పీ పట్నాయక్ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ ఇదితోనే అతని జర్నీలో ఎన్నో ఎత్తుపళ్లాలు వచ్చినా ఓర్చుకున్నాడు. టాలీవుడ్లో మ్యూజిక్ డైరెక్టర్లలో ట్రెండ్ సృష్టించడమే కాకుండా తక్కువ టైమ్లోనే ఎక్కువ పేరు తెచ్చుకున్నవాడు ఆర్పీ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే తాజాగా ఆర్పీ..ఆలీతో జరిపిన ఓ ఇంటర్వూలో … తాను కెరియర్ ను మొదలు పెట్టడానికి దారితీసిన పరిస్థితులను గురించి ఆర్పీ పట్నాయక్ ప్రస్తావించాడు.

సినిమాల్లోకి రావడానికి ముందు ఆర్పీ…’ఆనందం’ అనే ఓ ప్రైవేట్ ఆల్బమ్ చేశాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ,సునీల్ ఇతని రూమ్మేట్స్. ఆ ఆల్బమ్ కి లిరిక్ రైటర్ గా త్రివిక్రమ్ పనిచేశాడు. అలాంటి సందర్భంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు అయిన తరువాత మీకెందుకు అవకాశం ఇవ్వలేదు?’ అనే ప్రశ్న అలీ నుంచి వచ్చింది. అప్పుడు ఆర్పీ స్పందిస్తూ త్రివిక్రమ్ ‘ఫస్టు సినిమాగా ‘నువ్వే నువ్వే’ చేశాడు .. అది స్రవంతి బ్యానర్ లోనిది. ఆ బ్యానర్ కి రెగ్యులర్ మ్యూజిక్ డైరెక్టర్ గా కోటి ఉండేవారు. త్రివిక్రమ్ తాను చేసే సినిమాకి ఆర్పీ కరెక్ట్ అనుకున్న రోజున నన్ను తప్పకుండా పిలుస్తాడు .. నేను అడక్కూడదు. నేను 99 శాతం అవుట్ పుట్ ఇస్తాననీ .. మరో సంగీత దర్శకుడైతే 100 శాతం అవుట్ పుట్ ఇస్తాడని త్రివిక్రమ్ అనుకుంటే, వేరే దర్శకుడిని ఆయన తీసుకుకోవడమే కరెక్ట్. నేను ఎవరికీ ఆబ్లిగేషన్ కాకూడదనేది నా అభిప్రాయం” అంటూ తన మనసులో మాట చెప్పుకొచ్చాడు.ఇదే తరహా డైలాగ్స్ ను గతంలో సునీల్ కూడా చెప్పాడు. త్రివిక్రమ్ మిమ్మల్ని పెట్టి ఎందుకు సినిమా చేయకూడదు అని ఎవరో అడిగితే…వాడికి కష్టమొస్తే నాతో చెపుకుంటాడు. వాడికి నాతోనే ప్రాబ్లమ్ వస్తే…నేను ఎవరితో చెపుకోవాలి అని చెప్పడు. ఇపుడు ఆర్పీ చెప్పిన సమాధానం చూస్తుంటే గతంలో సునీల్ చెప్పిన మాటే గుర్తుకు వస్తుంది. ఓవరాల్ గా చూస్తే ఏం తెలిసిందంటే…త్రివిక్రమ్ అనేవాడు ఎంత రూమ్మేట్ అయినప్పటికీ…ఎవరి విషయంలోను కరిగిపోయేవాడు కాదు అనే విషయం అర్ధమైంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -